జూనియర్ సివిల్ కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మల్లేశం గౌడ్ గెలుపు..

by Disha Web Desk 20 |
జూనియర్ సివిల్ కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మల్లేశం గౌడ్ గెలుపు..
X

దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడి ఎన్నిక కోసం జరిగిన ఎన్నికలలో పొన్నం మల్లేష్ గౌడ్ గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకు ఓట్లు వేసి గెలిపించిన తోటి న్యాయవాదులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం తోటి న్యాయవాదులు ఆయనకు శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రమేష్ , మహేష్, రవీందర్, కార్తీక్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed