దిలావర్పూర్ మండలంలో పర్యటించిన మంత్రి ఐ.కే రెడ్డి..

by Disha Web Desk 20 |
దిలావర్పూర్ మండలంలో పర్యటించిన మంత్రి ఐ.కే రెడ్డి..
X

దిశ, దిలావర్పూర్ : దిలావర్పూర్ మండలంలో ఆదివారం ఉదయం దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. లోలం నుండి దిలావర్పూర్ తాండా మీదగా బన్సపల్లి రోడ్డు వరకు 2.80 కోట్లతో మంజూరైన బీటీ రోడ్డుకు కలెక్టర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం లోలం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దిలావర్పూర్ మండలానికి సంబంధించిన 19, నర్సాపూర్ మండలానికి సంబంధించిన 16 కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

లోలం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ రంగాలలో దూసుకెళ్తుందని, తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో లేవు అని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారని ఒక ఆడపిల్ల వివాహం చేయడానికి తల్లిదండ్రులు ఎంతో ఇబ్బందులకు గురి కావడం జరుగుతోందని కేసీఆర్ పెద్ద మనసుతో ఆలోచించి వారికి ఆర్థిక చేతనందిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరను డీజిల్ పెట్రోల్ రేట్లను రోజురోజుకు పెంచుకుంటూ పోతుందని ఇప్పుడు బీజేపీ నాయకులు అబద్ధాలు మాట్లాడుతూ పబ్బం గడుపుతున్నారని అన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాలలో ఎటువంటి సంక్షేమలు గాని, అభివృద్ధి గాని జరగడం లేదని మన పక్కన ఉన్న మహారాష్ట్రలో ఎటువంటి కార్యక్రమాలు జరగడంలేదని అన్నారు.

రానున్న ఎన్నికల్లో మహారాష్ట్రలో ప్రజలు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు కలెక్టర్ వరుణ్ రెడ్డి నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలక వెంకటరమణ, ఎఫ్ఎసీఎస్ అధ్యక్షులు ధర్మాజీ గారి రాజేందర్, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు యు.సుభాష్ రావు, దిలావర్పూర్ ఎంపీపీ పాల్దే అక్షర అనిల్, ఉపాధ్యక్షులు బాబురావు, పీఏసీఎస్ చైర్మన్ పుండ్రు వెంకట రమణారెడ్డి తాసిల్దార్ కరీముల్లా ఎంపీఓ అజీజ్ ఖాన్ లోలం సర్పంచ్ ఒడ్నం సవిత కృష్ణ, కదిలి దేవస్థానం అధ్యక్షుడు భుజంగరావు కాల్వ దేవస్థానం అధ్యక్షులు చిన్నయ్య మండలంలోని సర్పంచులు ఇట్టెడి గంగారెడ్డి, గుండ మధుకర్, రోడ్డు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed