ఇష్టారాజ్యంగా నిర్మాణాలు... చోద్యం చూస్తున్న అధికారులు..

by Disha Web Desk 20 |
ఇష్టారాజ్యంగా నిర్మాణాలు... చోద్యం చూస్తున్న అధికారులు..
X

దిశ, రామకృష్ణాపూర్ : అక్రమ కట్టడాలకు రామకృష్ణాపుర్ పట్టణం అడ్డాగా మారింది. నిబంధనల్లోని లొసుగుల ఆధారంగా ఈ కట్టడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పర్యవేక్షించాల్సిన పురపాలక సంఘం అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తుండడం, నామ మాత్రపు విధులకే పరిమితం అవుతుండడంతో అక్రమ కట్టడాలకు అంతు లేకుండా పోతోంది. పట్టణంలోని రాజీవ్ చౌక్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఫిర్యాదులు లేదా అందిన సమాచారం మేరకు పరిశీలనకు వెళ్లే అధికారులకు అక్రమ కట్టడాల యజమానులు సర్దిచెప్పుతుండడంతో తీసుకోవాల్సిన చర్యలు కాస్తా అటకెక్కిస్తున్నట్లు జోరుగా ప్రచారమవుతోంది.

కమర్షియల్ ఏరియా స్థలాలను కబ్జా చేసేందుకు కొందరు ఏకంగా రోడ్లను సైతం వదలకుండా అక్రమ నిర్మాణాలు చేసి దుకాణాలు పెడుతున్నారు. దుకాణాలకు వచ్చే కొనుగోలుదారులుతమ వాహనాలను రోడ్లపై నిలపడంతో వచ్చిపోయే వాహనాలకు, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని సమయాల్లో నిలిపిన వాహనాల వల్ల ప్రమాదాలు జరిగిన సందర్భాలు లేకపోలేదు. అధికారుల అశ్రద్ధతోనే ప్రమాదాల భారిన పడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు, పురఅధికారులు వారి తీరు మార్చుకొని అక్రమంగా వెలిసిన నిర్మాణాలను, రోడ్లను ఆనుకొని కట్టడాల పై చర్యలు తీసుకోవాలని స్థానికులు చర్చించుకుంటున్నారు.



Next Story

Most Viewed