సింగరేణిని అప్పులమయంగా మార్చిన ప్రభుత్వం : మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్

by Disha Web Desk 1 |
సింగరేణిని అప్పులమయంగా మార్చిన ప్రభుత్వం : మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్
X

దిశ, నస్పూర్ : బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింగరేణిని అప్పులమయంగా మార్చిందని మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్ అన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ మూడో గనిలో బీఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరం రమేష్ అధ్యక్షతన బీఎంఎస్ యూనియన్ గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్ పాల్గొని మాట్లాడారు.

బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు ప్రైవేటీకరణపై కార్మికులను తప్పుదోవ పట్టించి కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సింగరేణి డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్ నిధులు సింగరేణి ప్రాంతాలలో ఖర్చు పెట్టకుండా ఇతర జిల్లాలకు తరలించడంతో సింగరేణి ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని పేర్కొన్నారు. బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనకుండా ప్రభుత్వం అడ్డుకొని కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు గనులను అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తుందని తెలిపారు.

రూ.వేల కోట్ల ఆదాయం ఉన్న సింగరేణిని బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అప్పులమయంగా మార్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు అగల్ డ్యూటీ రాజు, నాయకులు బరుపటి మారుతి, కదాసు భీమయ్య, సత్రం రమేష్, మిట్టపల్లి మొగిలి, ఈర్ల సదానందం వినోద్, సందీప్, రాజకుమార్, బుద్దే రాజన్న, తరాల విజయ్, మహేష్, రాయమల్లు, రవీందర్, రాజలింగు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed