ముధోల్‌లో హోరాహోరీగా కుస్తీ పోటీలు

by Disha Web Desk 23 |
ముధోల్‌లో  హోరాహోరీగా కుస్తీ పోటీలు
X

దిశ,ముధోల్ : మండల కేంద్రమైన ముధోల్ లోని జటాశంకర్ ఆలయ ప్రాంగణంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మల్లయోధుల తో పాటు మహారాష్ట్రకు చెందిన మల్లా యోధులు పాల్గొన్నారు. మల్ల యోధులు చివరి వరకు నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడిన తీరు చూపరులను కనువిందు చేసింది. ముఖ్యంగా చిన్నారులు సైతం కుస్తీ పోటీల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివరి కుస్తీ పోటీలో గెలుపొందిన విజేతకు ఐదు వేల నగదును అందించారు.

దాదాపు మల్ల యోధులకు లక్ష వరకు నగదు బహుమతులను పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం ముధోల్ కుస్తీ పోటీలు అంటే మల్లాయోధులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వీక్షకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైతం కుస్తీ పోటీల సందర్భంగా గట్టి బందోబస్తు నిర్వహించారు. కుస్తీ పోటీలను చూడడానికి యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ అధ్యక్షుడు గుంజలోల్ల నారాయణ, కోశాధికారి మేత్రి సాయినాథ్, మున్నూరు కాపు సంగం తాలూకా అధ్యక్షుడు రోళ్ల రమేష్, సంఘం సభ్యులు అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed