నీటి స‌ర‌ఫ‌రాపై ప్ర‌తిరోజు నివేదిక ఇవ్వాలి : కలెక్టర్

by Disha Web Desk 11 |
నీటి స‌ర‌ఫ‌రాపై ప్ర‌తిరోజు నివేదిక ఇవ్వాలి : కలెక్టర్
X

దిశ‌, మంచిర్యాల : మిషన్ భగీరథ పథకం కింద జరుగుతున్న నీటి సరఫరాపై ప్రతి రోజు నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. శనివారం ఎల్లంపల్లి ప్రాజెక్టును సంద‌ర్శించిన ఆయ‌న అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. వేసవి కాలం పూర్తి అయ్యే వరకు జిల్లా వ్యాప్తంగా ప్రజలందరికీ సరిపడా తాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటామ‌న్నారు.ఎల్లంపల్లి ప్రాజెక్టు సెగ్మెంట్ పరిధిలో వేసవికాలం పూర్తయ్యే వరకు నిరంతర తాగునీటి సరఫరాకు కార్యాచరణ రూపొందించాలన్నారు.

మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి అందుతున్న తాగునీటి సరఫరా ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమస్యలు తలెత్తి నట్లయితే త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. నీటి వనరులు అందుబాటులో లేని ప్రాంతాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. వచ్చే 3 నెలలు ప్రతి ఇంటికి నీటిని అందించేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో క‌లెక్ట‌ర్‌తో పాటు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి, రాహుల్, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, మిషన్ భగీరథ ఈ.ఈ. మధుసూదన్ త‌దిత‌రులు ఉన్నారు.



Next Story

Most Viewed