బెజ్జూర్ మండలంలో పర్యటించిన అదనపు కలెక్టర్ చ హత్ బాచ్పేయి..

by Disha Web Desk 20 |
బెజ్జూర్ మండలంలో పర్యటించిన అదనపు కలెక్టర్ చ హత్ బాచ్పేయి..
X

దిశ, బెజ్జుర్ : పాఠశాలల్లో సిలబస్ పూర్తి అయ్యిందా.. పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నాయి పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలని కొమురం భీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ చ హత్ బాచ్పేయి అన్నారు. బుధవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలోని ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చ హత్ బాచ్పేయి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించారు. ఆశ్రమ పాఠశాలలోని ఉపాధ్యాయుల రిజిస్టర్ ను పరిశీలించారు. సగం మంది సీఆర్టీలు విధులకు గైర్హాజరు కావడం పై ఆమె అసహనం వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరుకావాలని, కానీ ఉపాధ్యాయుల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తయ్యాయా అని అడిగారు. పరీక్షలు పూర్తయితే డిస్కషన్ పెట్టాలని సూచించారు. అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉన్నారా అని అడిగారు. స్టాక్ రూమ్ ను పరిశీలించారు. మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల సందర్శించారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనం పరిశీలించార. భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు తెలపడంతో స్వయంగా తాను పరిశీలించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో కాంపౌండ్ వాల్ పూర్తవ్వడంతో వెంటనే ఎంబీ రికార్డ్స్ చేసి బిల్లులు పొందాలని సూచించారు.

మధ్యాహ్న భోజనం బిల్లులు సక్రమంగా రావడం లేదని భోజనం నిర్వాహకులు తెలుపగా, ఎప్పటి వరకు వచ్చాయని హెచ్ఎం రవికుమార్ ను అడిగారు. అక్టోబర్ వరకు బిల్లులు వచ్చినట్లు తెలపడంతో బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు సక్రమ నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. పాఠశాలలో మరుగుదొడ్లు దుర్వాసన వస్తున్నాయని విద్యార్థులు తెలపడంతో వెంటనే స్కావెంజర్ నియమించి మరుగుదొడ్లు శుభ్రపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో మాధవిని ఆదేశించారు. ఏప్రిల్ వరకు టాయిలెట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామంలో పాఠశాల భవనానికి నిధులు మంజూరైనా భవనం అసంపూర్తిగా ఉందని వెంటనే పూర్తి చేయాలని గ్రామస్తులు కోరారు. అదనపు కలెక్టర్ స్పందించి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆమె వెంట ఎంపీడీవో మాధవి, ఎంపీఓ రమేష్ రెడ్డి, గ్రామ కార్యదర్శి తుకారం ఉన్నారు.

Next Story

Most Viewed