ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ షాక్.. బీజేపీలో చేరిన కీలక నేత

by Disha Web Desk 12 |
ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ షాక్.. బీజేపీలో చేరిన కీలక నేత
X

దిశ, బెజ్జూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ కార్యదర్శి సభ్యులు అరిగేల నాగేశ్వరరావు, ఎంపీపీ మల్లికార్జున్ బుధవారం హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మన్ సమక్షంలో చేరారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాగేశ్వరరావు బీజేపీలో చేరడం తో ఆ పార్టీకి మరింత బలం చేకూరినట్లు అయింది. నాగేశ్వరరావు గతంలో టీడీపీలో చక్రం తిప్పి, బీఆర్ఎస్‌లో రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గెలుపు కృషి చేసిన నాగేశ్వరరావు ఎంపీకి మాత్రం షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి నగేష్ కోసం కృషి చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది.

Next Story

Most Viewed