భూమిపూజ ఓకే..పనులు మాత్రం ఇంకా స్టార్ట్ కాలే..!

by Dishanational2 |
భూమిపూజ ఓకే..పనులు మాత్రం ఇంకా స్టార్ట్ కాలే..!
X

దిశ, బైంసా : భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా బాసర సరస్వతీ అమ్మవారి పుణ్యక్షేత్ర అభివృద్ధి ఎందుకు ఆలస్యం అవుతుంది.ప్రతీసారి వారం రోజులు హడావుడి ఆ తర్వాత అభివృద్ధి విషయంలో అధికారుల చర్యలు నెమ్మదించడం ఇదే తంతు సాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే పలు దేవాలయాల అభివృద్ధి సాగగా బాసర పుణ్యక్షేత్ర అభివృద్ధి మాత్రం అందుకు భిన్న0గా తయారయింది. అమ్మవారి ఆలయ అభివృద్ధి విషయంపై ప్రకటనలు తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి కదలిక కనిపించడం లేదని భక్తులు వా పోతున్నారు. మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిం చడం దానిని కర్ణాటకలోని శృంగేరి పీఠానికి వెళ్లి అక్కడి పీఠాధిపతుల సలహాలు తీసుకోవడం మళ్లీ మార్పు చేయడం ఇలా అధికారులు హడా వుడి చేయగా, ఆ తర్వాత దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ వరుణ్‌ రెడ్డి మార్చి 24వ తేదీన అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ నిర్వహించగా... హమ్మయ్య..! అభివృద్ది జరిగిపోతుందని భక్తప్రజలు భావించారు. కానీ రెండు నెలలు పైబడిన పనులకు మాత్రం ప్రారంభం అవ్వడం లేదు.

భూమి పూజ ఓకే..! నిర్మాణ పనులే ఆలస్యం?

శృంగేరి పీఠాధితులు సూచించిన ముహుర్తా నికి మార్చి 24వ తేదీన అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం కోసం భూమిపూజ కార్యక్రమం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి పాల్గొని నిర్వహించారు. అధికా రులు ప్రస్తుతం ఉన్న ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభమైతే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పా ట్ల ప్రణాళికను సైతం ఆలయ అధికారులు సిద్ధం చేసుకున్నారు. ఆ ర్భాటంగా పనులను ప్రారంభించిన మంత్రి ఆరోజు వారం, పది రోజుల్లో ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ప్రకటించగా... ఇప్పటికే దాదాపు రెండు నెలలు గడిచిపోయాయి. కాని ఇప్పటి వరకు కనీసం టెండర్లను కూడా పిలవలేదు. భూమి పూజ ఓకే..!పనులు మాత్రం నాటు ఓకే..! అంటూ భక్త ప్రజలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.దీన్ని బట్టి ఆలయ అభివృద్ది విషయంలో రాష్ట్రప్రభుత్వ యంత్రాంగానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుంది.

అనుమతి కోసం ఎదురుచూపు

ఆలయపునర్నిర్మాణానికి సుమారు రూ.200ల కోట్ల నిధుల వరకు అవసరం ఏర్పడుతుంది. అమ్మవారి ఆలయాన్ని ఇతర ఉప ఆల యాలన్నీంటినీ కృష్ణశిలలతో నిర్మించడం ఇప్పుడున్న ఆలయ ప్రాంగ ణాన్ని విస్తరించి నూతన ప్రాకార మండపం, నాలుగు రాజగోపురాలను నిర్మించడం మాస్టర్‌ప్లాన్‌లో పనులు చేపట్టనున్నారు.

బాసర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 42 కోట్లు నిధులు సిద్ధంగా ఉన్నాయి. ప్రణాళికలు కూడా శృంగేరి పీఠం స్వాములు ఆమోదిం చడంతో అధికారులు టెండరు వేసేందుకు సిద్దమయ్యారు. కాని దేవా దాయశాఖ అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనుమతి రావాలని సూచించడంతో పనులు పెండింగ్‌లో చేరిపోయాయి. ముఖ్య మంత్రి కార్యాలయ దృష్టికి తీసుకవెళ్లేవారే కరువయ్యారని, దీంతో సీఎంవో అనుమతులు రావడంలో తీవ్రజాప్యం చోటుచేసుకుంటోంది.జిల్లా నాయకులు, అధికార పార్టీ నాయకులు, జిల్లా ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని సీఎంవో అఫీసు నుంచి అనుమతులు తీసుకురావాలని భక్తుల కోరుకుంటున్నారు. బాసర అభివృద్ధి ప్రణాళికకు సీఎంవో ఆఫీసు నుంచి అనుమతులు ఎప్పుడు వస్తాయో, పనులు ఎప్పుడు మొదలవుతాయో ఇక వేచి చూడాల్సిందే..!

నిర్మల్ సభలో సీఎం నోట బాసరమాట

ఈ నెల 4వ తారీఖున నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టర్ భవన సముదాయ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నోటా బాసర మాట వినిపించింది.ఆలయ అధికారులు బాసర పరిస్థితుల గురించి వివరించగా.. త్వరలోనే బాసర పునర్నిర్మాణ అభివృద్ధి పనుల శంకుస్థాపన రోజు వస్తానని సభ ప్రాంగణంలో అన్నారు.ఇది విన్న భక్త ప్రజలు ఏదేమైనా తొందరలోనే కేసీఆర్ బాసరకు వచ్చి అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసి,పనులు స్టార్ట్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు.



Next Story

Most Viewed