BREAKING: నగరానికి చేరుకుంటున్న ఆంధ్రావాసులు.. ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు

by Shiva |
BREAKING: నగరానికి చేరుకుంటున్న ఆంధ్రావాసులు.. ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గడిచిన రెండు రోజులు జన సచారం లేక నగరం బోసిపోయింది. బతుకుదెరువు కోసం ఆంధ్రా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వాళ్లంతా తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు తమ సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో పట్టణంలోని పలు కూడళ్లు.. మెట్ర స్టేషన్లు, బస్ సేషన్లు, రైల్వే స్టేషన్లు వెలవెలబోయాయి. అయితే, నిన్నటితో పోలింగ్ ముగియండంతో ఆంధ్రాకు వెళ్లిన వారంతా ఒక్కొక్కరుగా నగరానికి చేరుకుంటున్నారు. బస్సుల్లో వెళ్లిన వాళ్లు రిటర్న్ టికెట్ అప్పుడు బుక్ చేసుకోవడంతో ఇవాళ వేకువజామునే వారంతా నగరానికి చేరుకున్నారు.

ఈ క్రమంలోనే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉదయం 5.30 నుంచే మెట్రో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. విజయవాడ నుంచి హైరదాబాద్ వచ్చే ప్రయాణికులకు మొదటి చెక్ పాయింట్ ఎల్బీ నగర్ కావడంతో ప్రయాణికులు వారి స్వస్థలాలకు చేరుకునేందుకు మెట్రో రైలు ఆశ్రయిస్తున్నారు. దీంతో ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వైపు వెళ్లే మెట్రోలో రద్దీ పెరిగింది. అదేవిధంగా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ ట్రిప్పులు నడపాలని మెట్రో యోచిస్తోంది. అసలే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం ప్రయాణంతో దివాళా తీస్తున్న మెట్రోకు ఈ పరిణామం ఊపిరిపోయినట్లైంది.

Next Story

Most Viewed