- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భువనగిరి లో భారీ వర్షం… అతలాకుతలమైన పట్టణం

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి పట్టణంలో శనివారం వర్షం బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం సమయంలో మేఘావృతమైన ఆకాశం ఒకేసారి వర్షాన్ని కుమ్మరించింది. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో భువనగిరి పట్టణం అతలాకుతలమైంది.
జంఖాన్ గూడ చౌరస్తా వద్ద నిలిచిపోయిన రాకపోకలు...
భువనగిరి పట్టణం నుంచి నల్గొండ రోడ్డు వైపుకు వెళ్లే జంఖాన్ గూడ చౌరస్తా వద్ద వరద రావడంతో రెండు వైపులా రాకపోకలు నిలిచిపోయాయి. పై నుంచి పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో వాహనదారులు రెండువైపులా తమ వాహనాలను నిలిపివేశారు. మరోవైపు భువనగిరి ప్రిన్స్ కార్నర్ వద్ద సైతం పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో అక్కడ కూడా రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జగదేవపూర్ చౌరస్తా వద్ద సైతం ఇదే దుస్థితి నెలకొంది. కోర్టు ప్రాంగణం భువనగిరి బస్టాండ్ ప్రాంగణంలో కూడా వరద నీరు నిలిచిపోయాయి. నల్గొండ రోడ్డులోని రామ్ నగర్ వద్ద సైతం వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆందోళనలో పట్టణ ప్రజలు....
ప్రస్తుతం ఈ వర్షానికే ఇంతటి స్థాయిలో పట్టణంలో ఎక్కడికక్కడ ఇబ్బందులు ఎదురవడంతో వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో ఈసారి వర్షాలు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. వర్షాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇంకా భారీ వర్షాలు కురిస్తే పట్టణంలో పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుందని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.