కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్

by Disha Web Desk 23 |
కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆదిలాబాద్ మున్సిపల్  వైస్ చైర్మన్
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాన్ సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు హైదరాబాదులోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో పార్టీలో చేరి కండువా కప్పుకున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి పలువురు ముఖ్య నేతలు షాక్ ఇచ్చి, అధికార కాంగ్రెస్ పార్టీలో చేరగా మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాన్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరడం తో మెల్లమెల్లగా ఆదిలాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది.ఇది ఇలా ఉంటే మాజీ మంత్రి జోగు రామన్న సైతం ఎంపీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నట్లు ఆ పార్టీ పలువురు నాయకులు చెబుతున్నారు.



Next Story

Most Viewed