సైబర్ నేరగాని చేతిలో మోసపోయిన యువకుడు...

by Sumithra |
సైబర్ నేరగాని చేతిలో మోసపోయిన యువకుడు...
X

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సైబర్ నేరగాని చేతిలో మోసపోయిన ఓ యువకుడికి పోలీసులు డబ్బులు తిరిగి ఇప్పించారు. బాధితుడి అకౌంట్ కి జమ చేపించిన బెల్లంపల్లి పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి పట్టణం ఇంక్లైన్ రడగంబాలబస్తీకి చెందిన మోతీరాం రాజేందర్ తాండూరు మండలం బోయపల్లిలోని మైంటెనెన్సువర్క్, సోలార్ ప్లాంట్ లో పనిచేస్తున్నాడు. రాజేందర్ కు 2022 డిసెంబర్ 9న ఒక గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి తాము ముద్ర ఫైనాన్స్ కంపెనీ నుండి మాట్లాడుతున్నామనీ, మీ సిబిల్ స్కోర్ బాగున్నందుకు మీకు రూ. 1,00,000/- లోన్ ఇస్తామని చెప్పాడు.

ఆ మాటలు నమ్మిన భాదితుడు సదరు వ్యక్తికి రూ. 13,100/-లను పంచాడు. తర్వాత భాదితుడు మోసపోయానని గ్రహించి వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 కు కాల్ చేయగా, నిందితుని అకౌంట్ ఫ్రీజ్ చేశారు. ఈ విషయమై భాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెల్లంపల్లి టూటౌన్ పోలీస్ స్టేషన్ లో Cr. No.12/2023 u/s 420 IPC, Sec. 66-D of IT Act ప్రకారం కేసు నమోదు చేశారు. బెల్లంపల్లి రూరల్ సీఐ రాజకుమార్ గౌడ్ ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. భాదితుడు డబ్బులు పంపిన అకౌంట్ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తిదిగా గుర్తించి, వెంటనే బెల్లంపల్లి కోర్టు ద్వారా నిందితుని అకౌంట్ నుండి భాధితునీ అకౌంట్లోకీ రూ.13,100 లను తిరిగిజమ చేయించారు.

గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్ కు స్పందించద్దూ..

ఏదైనా గుర్తుతెలియని నెంబర్ల నుండి కాల్స్, మెసేజ్ లు వచ్చినా, ఇంకా ఏదైనా లింక్ లు వచ్చిన వాటికి రెస్పాండ్ కావద్దని బెల్లంపల్లి రూరల్ సీఐ రాజ్ కుమార్ గౌడ్ కోరారు. ఒకవేళ ఆన్లైన్ ద్వారా ఎవరైనా డబ్బులు పొగుట్టుకున్నట్లైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 కు కాల్ చేసి వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేయించుకోవాలని సూచించారు. ఇలాచేస్తే మోసపోయినవారికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.



Next Story