నడ్డా అధ్యక్షతన రీజినల్ కన్సల్టేటివ్ మీటింగ్ షురూ

by Javid Pasha |
jp nadda
X

దిశ, తెలంగాణ బ్యూరో : దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన బీజేపీ హైదరాబాద్ లో కీలక సమావేశం నిర్వహించింది. రీజినల్ కన్సల్టేటివ్ మీటింగ్ పేరిట నిర్వహిస్తున్న సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా వచ్చారు. కాగా ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. ఆయనతోపాటు బండి సంజయ్ సైతం నడ్డాను స్వాగతించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి 11 రాష్ట్రాల అధ్యక్షులు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, ప్రభారీలు హాజరయ్యారు. భవిష్యత్తులో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో రచించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. గతంలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో అమలు చేసిన వ్యూహాలు, సక్సెస్ అయిన తీరు, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు అనే అంశాలపై సుదీర్ఘ చర్చ జరపనున్నారు. గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులను అధిగమించేలా కార్యాచరణను రూపొందించుకోనున్నారు.

ఈ సమావేశానికి దాదాపు 35 మందికి పైగా డెలిగేట్స్ హాజరయ్యారు. సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ జీ, సునీల్ బన్సల్ హాజరై నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో పార్టీ నాయకత్వం మార్పు అనంతరం జరిగిన పరిణామాలపైనా నడ్డా సమీక్ష నిర్వహించే అవకాశముంది. అసంతృప్తులను బుజ్జగించే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. వర్గభేదాలు లేకుండా వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాలని నడ్డా దిశానిర్దేశం చేయనున్నట్లు వినికిడి. ఈ సమావేశంతో అయినా నేతల తీరు మారి ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధమవుతారా? లేక చేతులెత్తేస్తారా? అనేది చూడాల్సిందే. జేపీ నడ్డా రాక నేపథ్యంలో నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ప్రతిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. కార్యాలయంలోకి డెలిగేట్స్ తప్పితే ఇతరులను అనుమతించడం లేదు. ఇదిలావుండగా నడ్డాకు స్వాగతం పలికిన వారిలో ఎంపీ కె లక్ష్మణ్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, స్థానిక నేతలున్నారు.

మీటింగ్ లో పాల్గొనబోయే రాష్ట్రాలివే..

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్

కర్ణాటక

అండమాన్

లక్ష్యద్వీప్

పాండిచ్చేరి

మహారాష్ట్ర

ముంబై

గోవా

తమిళనాడు

కేరళ

Advertisement

Next Story

Most Viewed