పుస్తకం ఒక మంచి స్నేహితుడి కన్నా ఎక్కువ : Bandaru Dattatreya

by Disha Web Desk |
పుస్తకం ఒక మంచి స్నేహితుడి కన్నా ఎక్కువ : Bandaru Dattatreya
X

దిశ, ముషీరాబాద్ : నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న 35 వహైదరాబాద్ జాతీయ బుక్ ఫెయిర్‌కు సందర్శకుల తాకిడి పెరిగింది. సోమవారం సైతం పుస్తక నేస్తాలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రజాగాయకుడు గద్దర్ బుక్ ఫెయిర్‌ను సంద్శించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ పుస్తకం ఒక మంచి స్నేహితుడి కన్నా ఎక్కువన్నారు. అద్వానీ తన ప్రయాణంలో కూడా పుస్తకాలు చదువేవారన్నారు. పుస్తకాలు విజ్ఞానానికి, వికాసాన్ని పెంచేది లాగా ఉండాలన్నారు. పుస్తక పఠనం చాలా అవసరమని చెప్పారు. పఠనం ఒక నిర్మాణాత్మకంగా కొనసాగలని పుస్తక ప్రియులకు తెలిపారు. నేటి యువత వక్రమార్గంలో పడకుండ ఉండేందుకు పుస్తక పఠనం చాల దోదహపడుతుందని చెప్పారు. అంతేకాక రామాయణం, మహాభారతం మన దేశానికి గొప్ప సందేశాలను ఇస్తున్నాయిన వాటిని పఠించి అచరణ చేయాలన్నారు. అంతేకాని వాటిని వాటిని విస్మరించకూడదన్నారు.

ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ భారత దేశం అన్ని మతాలకు, అన్ని కులాలు కలిసి, మెలిసి ఉన్నాయన్నారు. ఎన్నిమతాలు ఉన్నా భారత రాజ్యంగమే దేశాన్ని నడిపిస్తుందన్నారు. రాజ్యంగంలో ఉన్న ప్రతి అంశాన్ని పాటించాల్సిన అవశ్యకత నేటి కేంద్ర ప్రభుత్వం పై ఉందని అన్నారు. అంతకుముందు అలిశెట్టి ప్రభాకర్ వేదిక పై ప్రజాసాహిత్యంపై గద్దర్‌తో డాక్టర్ కొండ నాగేశ్వర్ చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డ్ విజేత వారాల అనంద్ పాల్గొన్నారు. అదే వేదిక పై తుమ్మా భాస్కర్ రచించిన ప్రేమమృదంగం పుస్తకాన్ని ఆవిష్కరించారు. అలాగే ఇ. వెంకటేశ్వర శర్మ రచించిన గజల్స్ సారాలు పుస్తకావిష్కరణ జరిగింది.

ఆ తర్వాత డాక్టర్ సంగిశెట్టి శ్రీవివాస్, డాక్టర్ వెల్ధండి శ్రీధర్ సంపదకత్వంలో ప్రచురించిన నెనరు తెలంగాణ కథ 2021 పుస్తకాన్ని ప్రముఖ కథకులు తుమ్మేటి రఘోత్తమ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా తుమ్మేటి రఘోత్తమ రెడ్డి మాట్లాతూ ఈ నెనరులో వెల్డండి శ్రీధర్ కథ కూడ ఉందన్నారు. శ్రీధర్ తన కథ రచనలను మరిన్ని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కథకులు సమ్మెట ఉమాదేవి, కవి, విమర్శకులు, డా.యకూబ్, కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కార గ్రహీత డాక్టర్.గడ్డం మోహన్ రావు, కథకులు డా.కలువ మల్లయ్య, పెద్దింటి అశోక్‌కుమార్ తదితరులున్నారు.



Next Story

Most Viewed