'థ్యాంక్స్ టూ రేవంత్ రెడ్డి'.. టెన్త్ విద్యార్థులకు కలిసి వచ్చిన 5 నిమిషాల గ్రేస్ టైమ్

by Disha Web Desk 13 |
థ్యాంక్స్ టూ రేవంత్ రెడ్డి.. టెన్త్ విద్యార్థులకు కలిసి వచ్చిన 5 నిమిషాల గ్రేస్ టైమ్
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 ప్రారంభం కాగా ఈసారి ఒక నిమిషం నిబంధన స్థానంలో గ్రేస్ టైమ్ నిబంధనలో మార్పు పలువురు విద్యార్థులకు కలిసి వచ్చింది. ఇంటర్ లో ఒక నిమిషం నిబంధన కారణంగా పలువురు విద్యార్థులు చివరి నిమిషంలో పరీక్ష కేంద్రానికి చేరుకున్నా వారిని లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీంతో పలువురు విద్యార్థులు పరీక్ష రాసే అవకాశం కోల్పోయారు. ఈ రూల్ పై విద్యార్థులు, పలువురు మేధావుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పదోతరగతి పరీక్షల్లో ఈ నిబంధనను ప్రభుత్వం మార్చివేసింది. ఆస్యంగా వచ్చిన విద్యార్థులకు పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతి ఇచ్చారు. దీంతో ఇవాళ జరిగిన పదోతరగతి పరీక్షలో పలువురు విద్యార్థులకు ఈ గ్రేస్ టైమ్ పెంపు నిర్ణయం కలిసి వచ్చింది. గన్ ఫౌండ్రీ లోని మహబూబియా గర్ల్స్ గౌట్ హై స్కూల్ పరీక్ష సెంటర్లో 9:34 నిమిషాలకు యువరాజు అనే విద్యార్థి పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. అయితే గ్రేస్ టైమ్ 9:35 వరకు ఉండటంతో పరీక్షా కేంద్రంలో సిబ్బంది యువరాజ్ ను పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించారు. దీంతో సదరు విద్యార్థి సంతోషం వ్యక్తం చేస్తూ పరీక్ష కేంద్రంలోకి పరుగులు తీశాడు. ఇదే ప్రాతంలోని ఓ ఎగ్జామ్ సెంటర్ వద్ద మరో యువతి సైతం చివరి నిమిషంలో పరీక్షా కేంద్రానికి చేరుకోగా ఆమెను సైతం ఎగ్జామ్ కు అనుమతి ఇచ్చారు. కాగా ఈఏడాది 5,08,385 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాస్తున్నారు.


Next Story