23 నవోదయ పాఠశాలలు ఏమైనయ్..? బీఆర్ఎస్ పార్టీ ఆసక్తికర ట్వీట్

by Disha Web Desk 14 |
23 నవోదయ పాఠశాలలు ఏమైనయ్..? బీఆర్ఎస్ పార్టీ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ నవోదయ విద్యాల‌యాలపై ఆసక్తికర ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించింది. కేంద్రం నుంచి తెలంగాణ‌కు 23 న‌వోద‌య విద్యాల‌యాల రావాల్సి ఉందని తెలిపింది. ఈ అంశంపై తెలంగాణ నుంచి గెలిచిన న‌లుగురు బీజేపీ ఎంపీలు ఒక్క‌సారి కూడా కేంద్రాన్ని ప్ర‌శ్నించిన పాపాన పోలేదని విమర్శించింది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లారా మ‌న బిడ్డ‌ల భ‌విష్య‌త్తు ప‌ట్ట‌ని ఈ బీజేపీ ఎంపీలు మ‌న‌క‌వ‌స‌ర‌మా? అని బీఆర్ఎస్ ప్రశ్నించింది.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని, మన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుందామని పిలుపునిచ్చింది. దీనిపై నెటిజన్ల స్పందిస్తున్నారు. బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్, సోయం బాపు రావు, కలిసి అడిగిన మొత్తం ప్రశ్నలు 2107 అని, వారికి మతం పేరు చెప్పి ఓట్లు అడుగడమే సరిపోతదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.



Next Story

Most Viewed