తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

by Disha Web Desk 2 |
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అధికారులు సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయని వెల్లడించింది. మార్చి 18వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, 19వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, 21వ తేదీన థర్డ్ లాంగ్వేజ్, 23వ తేదీన మ్యాథ్స్, 26న సైన్స్(ఫిజికల్ సైన్స్), సైన్స్(బయాలజీ), 30న సోషల్ స్టడీస్, ఏప్రిల్ 1న సంస్కృతం, 4న సంస్కృతం పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలన్నీ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నారు.

Next Story

Most Viewed