వేసవి సెలవులు మరోసారి పొడిగింపు..

by  |
school-holidays -1
X

దిశ, తెలంగాణ బ్యూరో: వేసవి సెలవులను మరోసారి పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్-19 జాగ్రత్తల్లో భాగంగా ఈ నెల 20 వరకు పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగించినట్లు ప్రకటించింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపింది. జూన్ 16 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదికలను పంపించింది.

ప్రస్తుతం ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్న 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని ఆలోచనలు చేశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ఉన్నతాధికారులకు పాఠశాలలను సిద్ధం చేసుకోవాలని మౌకిక ఆదేశాలు జారీ అయ్యాయి. విద్యాసంస్థలు ప్రారంభమవుతాయని అనుకునే తరుణంలో ప్రభుత్వం ఈనెల 20 వరకు వేసవి సెలవులను పొడగిస్తూ మరోసారి నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాధి వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.



Next Story

Most Viewed