Whatsapp : ఫేస్‌అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ స్కానర్‌‌తో WhatsApp లాగిన్

by Disha Web Desk 17 |
Whatsapp : ఫేస్‌అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ స్కానర్‌‌తో WhatsApp లాగిన్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ ఇటీవల కొత్త కొత్త ఆప్షన్లను తీసుకొస్తుంది. ఇప్పుడు తాజాగా మెసేజింగ్ యాప్‌కు మరింత భద్రత అందించడానికి పాస్‌కీల సపోర్ట్‌ను అందిస్తుంది. వాట్సాప్ ఖాతాలకు ఇకమీదట లాగిన్ కావడానికి ఫేస్‌అన్‌లాక్, వేలిముద్ర స్కానర్‌ను ఉపయోగించవచ్చు. ఇటీవల సెర్చింజన్ గూగుల్ తన ఖాతాలకు లాగిన్ కావడానికి పాస్‌కీలను అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అన్ని యాప్‌లు కూడా పాస్‌కీలను అందించడానికి సిద్ధంగా ఉన్నాయి.

అకౌంట్లను సురక్షితంగా ఉంచడానికి OTPని టైప్ చేయడానికి బదులు పాస్‌కీ ఆప్షన్ బాగా ఉపయోగపడుతుందని వాట్సాప్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. వాట్సాప్‌లో పాస్‌కీ ఆప్షన్ ఎనెబుల్ చేయడానికి అకౌంట్‌లోకి వెళ్లి పాస్‌కీ ఆప్షన్ క్లిక్ చేసి క్రియేట్ పాస్‌కీని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఈ ఆప్షన్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.23.21.12కి అందుబాటులో ఉంది.


Next Story