సముద్రం నుంచే శత్రువులకు దిమ్మదిరిగే సమాధానం.. మొదటిసారిగా సి-డోమ్ ప్రయోగం..

by Disha Web Desk 20 |
సముద్రం నుంచే శత్రువులకు దిమ్మదిరిగే సమాధానం.. మొదటిసారిగా సి-డోమ్ ప్రయోగం..
X

దిశ, ఫీచర్స్ : ఇజ్రాయెల్ తన శత్రువులకు తగిన సమాధానం ఇచ్చేందుకు మరో అడుగు ముందుకేసింది. ఇజ్రాయెల్ మొదటిసారిగా ఓడలో సి-డోమ్‌ను మోహరించింది. ఫిబ్రవరిలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు బాలిస్టిక్ క్షిపణి లక్ష్యంగా చేసుకున్న ఈలాట్ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం (IDF) హెచ్చరిక జారీ చేసింది. ఇజ్రాయెల్ ఈ భాగానికి సమీపంలో షిప్ మౌంటెడ్ డిఫెన్స్ సిస్టమ్ సి-డోమ్‌ను ఏర్పాటు చేసింది.

సి - డోమ్ అంటే ఏమిటి.. ఎలా పని చేస్తుంది ?

సీ-డోమ్ అనేది ఇజ్రాయెల్ కు చెందిన ఐరన్ డోమ్ నౌకాదళ వెర్షన్. అంటే ఇప్పుడు శత్రువుల దాడులను సముద్రం నుండి ఆపవచ్చు. సి-డోమ్‌ని గురించి తెలుసుకునే ముందు ఐరన్ డోమ్‌ గురించి తెలుసుకోవాలి. ఐరన్ డోమ్ అనేది వాయు రక్షణ వ్యవస్థ. ఇది రాకెట్ దాడులు, మోర్టార్లు, TOP షెల్స్ వంటి దాడులను గ్రహించి గాలిలో కూడా వాటిని నాశనం చేయగలదు.

మీడియా నివేదికల ప్రకారం ఇది 70 కిలోమీటర్ల వ్యాసార్థాన్ని కవర్ చేస్తుంది. ఏదైనా శత్రు క్షిపణి లేదా రాకెట్ ఈ పరిధిలోకి వచ్చిన వెంటనే, ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ స్వయంగా యాక్టివ్ అయ్యి దానిని నాశనం చేస్తుంది. సరళమైన భాషలో చెప్పాలంటే శత్రువుల దాడులను ఆపివేసే భూమి నుండి గగనతల రక్షణ వ్యవస్థ. ఇది 90 శాతం వరకు దాడులను నిరోధించగలదు.

2006 తర్వాత ఇజ్రాయెల్ ఈ వ్యవస్థను సిద్ధం చేసింది. నిజానికి 2006లో లెబనాన్‌తో యుద్ధం తర్వాత, ఇజ్రాయెల్‌లోని ఉత్తర ప్రాంతంలో హిజ్బుల్లా వేలాది రాకెట్లను ప్రయోగించింది. దీంతో వందలాది మంది చనిపోయారు. ఈ సంఘటన నుండి గుణపాఠం తీసుకున్న ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌ను సిద్ధం చేసింది. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లో పని చేస్తుంది. రాకెట్ -క్షిపణులను ట్రాక్ చేయడానికి రాడార్‌ను ఉపయోగిస్తుంది. కొత్త సి-డోమ్ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. ఒకే తేడా ఏమిటంటే ఇది సముద్ర ప్రాంతాలలో మోహరించిన నౌకల పై మోహరించింది.

సి-డోమ్ 2014లో ప్రవేశపెట్టారు..

సి-డోమ్‌ను తొలిసారిగా 2014లో ప్రవేశపెట్టారు. ఇది 2022లో సైన్యంలో భాగంగా మారింది. ఇప్పుడు తొలిసారిగా శత్రు క్షిపణులు, రాకెట్లకు తగిన సమాధానం ఇచ్చేందుకు దీన్ని మోహరించారు. అయితే ఐరన్ డోమ్‌లో ఉన్న టెక్నాలజీనే ఇందులో ఉపయోగించారు. ఒకే తేడా ఏమిటంటే ఐరన్ డోమ్ భూమి పై, సి-డోమ్ సముద్రంలో అమర్చారు.

ఐరన్ డోమ్ నుండి ఇది ఎంత భిన్నంగా ఉంటుంది ?

ఈ రెండింటి రాడార్‌లో మాత్రమే తేడా ఉందని దీనిని అభివృద్ధి చేసిన ఇజ్రాయెల్ సంస్థ రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్ లిమిటెడ్ చెబుతోంది. ఐరన్ డోమ్ దాని స్వంత రాడార్‌ను కలిగి ఉంది. అయితే సి-డోమ్ తన వైపు కదులుతున్న లక్ష్యాన్ని గుర్తించడానికి ఓడలో అమర్చిన రాడార్‌ను ఉపయోగిస్తుంది. ఇది దాని వృత్తాకార పరిధిలో వచ్చే లక్ష్యాలను నాశనం చేయడానికి పని చేస్తుంది.



Next Story

Most Viewed