6,000mAh భారీ బ్యాటరీతో రూ.13 వేలకే Vivo కొత్త స్మార్ట్‌ఫోన్

by Disha Web Desk 17 |
6,000mAh భారీ బ్యాటరీతో రూ.13 వేలకే Vivo కొత్త స్మార్ట్‌ఫోన్
X

దిశ, టెక్నాలజీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో ఇండియాలో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Vivo T3x 5G’. ఫోన్ భారీ బ్యాటరీతో వచ్చింది. సెలెస్టియల్ గ్రీన్, క్రిమ్సన్ బ్లిస్ షేడ్స్‌ కలర్స్‌లలో లభిస్తుంది. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,499, 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ.14,999. 8GB RAM + 128GB స్టోరేజ్ టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 16,499. ఇది ఏప్రిల్ 24 నుంచి కంపెనీ ఆన్‌లైన్ స్టోర్, ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కొనుగోలు సమయంలో HDFC, SBI కార్డ్‌లపై రూ.1,500 తగ్గింపు ఉంటుంది.

Vivo T3x 5G ఫీచర్స్:

* 6.72 అంగుళాల ఫుల్-HD(1,080x2,408 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లే.

* 1000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌.

* స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 SoC ద్వారా పనిచేస్తుంది.

* ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పై రన్ అవుతుంది.

* మెమరీని మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు.

* బ్యాక్ సైడ్ 50MP+2MP కెమెరాలు ఉన్నాయి.

* ముందు సెల్ఫీల కోసం 8MP కెమెరా ఉంది.

* ఫోన్‌‌లో 44W ఫాస్ట్ చార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీని అందించారు.

* ఒక్క చార్జింగ్‌తో 68 గంటల వరకు ఆన్‌లైన్ మ్యూజిక్ ప్లేబ్యాక్ అందిస్తుందని కంపెనీ పేర్కొంటుంది.

* ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్‌కు ఉంది, డస్ట్, దుమ్ము కోసం IP64 రేటింగ్ ఉంది.


Next Story

Most Viewed