రూ.8 వేలకే లభిస్తున్న Tecno కొత్త స్మార్ట్‌ఫోన్

by Disha Web Desk 17 |
రూ.8 వేలకే లభిస్తున్న Tecno కొత్త స్మార్ట్‌ఫోన్
X

దిశ, టెక్నాలజీ: Tecno కంపెనీ ఇండియాలో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Tecno Spark 20C’. బేస్ వేరియంట్ 8GB RAM+ 128GB స్టోరేజ్ ధర రూ.8,999. అయితే లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.1000 తగ్గింపుతో రూ.7,999కే లభిస్తుంది. మార్చి 5 నుండి అమెజాన్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఫోన్ ఆల్పెంగ్లో గోల్డ్, గ్రావిటీ బ్లాక్, మిస్టరీ వైట్, మ్యాజిక్ స్కిన్ గ్రీన్ కలర్స్‌లలో లభిస్తుంది. మెమరీని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు. గేమింగ్ కోసం ప్రత్యేక టెక్నాలజీని కలిగి ఉంది. ఫోన్ కేవలం 50 నిమిషాల్లో 0- 50 శాతానికి చార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది.


Tecno Spark 20C స్పెసిఫికేషన్లు

* 6.6-అంగుళాల HD+ (720 x 1,612 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌, 90Hz రిఫ్రెష్ రేట్‌.

* MediaTek Helio G36 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.

* ఆండ్రాయిడ్ 13-ఆధారిత HiOS 13తో రన్ అవుతుంది.

* ఫోన్ బ్యాక్‌సైడ్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ, AI-బ్యాక్డ్ సెన్సార్‌ని అమర్చారు.

* ముందు సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

* 18W వైర్డు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందించారు.

* సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్‌లాక్‌ను కలిగి ఉంది.

Next Story

Most Viewed