Google Search India : గూగుల్ ఇండియా సెర్చ్‌లో మరిన్ని ఆప్షన్స్

by Disha Web Desk 17 |
Google Search India : గూగుల్ ఇండియా సెర్చ్‌లో మరిన్ని ఆప్షన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టెక్ దిగ్గజం గూగుల్ తన సెర్చింజన్‌లో AI ఫీచర్లను తీసుకొచ్చినట్లు గతంలోనే ప్రకటించింది. అయితే తాజాగా తన SGE(సెర్చింగ్ అనుభవం)ని సరికొత్తగా అందించడానికి మరిన్ని అప్‌డేట్‌లను తీసుకొస్తుంది. గురువారం జరిగిన గూగుల్ ఫర్ ఇండియా 2023 ఈవెంట్‌లో దేశంలోని AI సెర్చింగ్‌కు వస్తున్న అప్‌డేట్‌లను కంపెనీ ప్రకటించింది. లోకల్‌గా ఉపయోగపడే అన్ని రకాల విషయాలను సెర్చింజన్‌లో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం, ఆరోగ్య సంరక్షణ, గృహనిర్మాణం, ఉపాధి, మహిళా సంక్షేమం, వ్యవసాయం వంటి 100 కి పైగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు సులభంగా అర్థం అయ్యేలా పూర్తి వివరాలతో తెలుసుకోవచ్చు.

వంట చేయడం, చీర కట్టుకోవడం వివిధ రకాల ఫొటోల చరిత్ర గురించి తెలుసుకోవడం, వీడియోల వివరాలను కనుక్కోవడం, అలాగే వాటికి అనుబంధంగా ఉండే ఇతర ఫొటోలు, వీడియోలను చూపించడం వంటివి ఇకమీదట సులభంగా ఉంటాయని కంపెనీ అధికారులు పేర్కొన్నారు. వినియోగదారులు లోకల్‌గా జరిగే విషయాలను తెలుసుకోవడానికి కూడా కొత్త అప్‌డేట్‌లను తీసుకొస్తున్నారు.

దీంతో పాటు Google Lens లో కొత్త ఆప్షన్లను తెస్తున్నారు. వ్యక్తులు స్కిన్‌ను స్కాన్ చేయగానే చర్మ పరిస్థితులను తెలుసుకునే ఆప్షన్ వస్తుంది. ఇది ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నప్పటికి దీనిని AI ఫీచర్లతో అప్‌డేట్ చేయనున్నారు. షాపింగ్ అనుభవాన్ని మరింత మెరుగ్గా అందించడానికి కొత్త ఉత్పత్తులను కనుగొనడం ఈజీ కానుంది. ఉదాహరణకు రూ.15000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ అని టైప్ చేయగానే కంపెనీల వారీగా ఆ ధరల్లో ఫోన్ల లిస్ట్ కనిపిస్తుంది. వీటితో పాటు మరిన్ని కొత్త ఆప్షన్లను తీసుకురానున్నారు.



Next Story

Most Viewed