వీటిని వినియోగిస్తే దొంగలు డోర్ ని కూడా టచ్ చేయలేరట.. అవేంటో తెలుసా..

by Disha Web Desk 20 |
వీటిని వినియోగిస్తే దొంగలు డోర్ ని కూడా టచ్ చేయలేరట.. అవేంటో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం మని గడుపుతున్న హడావుడి జీవితంలో గృహ భద్రత చాలా ముఖ్యమైనది. చాలా కుటుంబాల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తూ, పిల్లలు బడికి వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటిని చూసుకునే నాథుడే కరువవుతున్నారు. ఈ పరిస్థితుల్ని అనుకూలంగా చేసుకున్న దొంగలు తాళాలు పగులగొట్టి వస్తువులన్నీ దోచుకుంటున్నారు. అయితే మీరు మీ ఇంటిని దొంగల నుండి సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే కొన్ని యాంటీ థెఫ్ట్ గాడ్జెట్‌ల ను వినియోగించడం మంచిది. వీటి ద్వారా ఇంటిని సురక్షితంగా ఉంచుకోవచ్చు.

కొన్ని యాంటీ థెఫ్ట్ గాడ్జెట్‌లు మార్కెట్‌లో సులభంగా లభిస్తాయి. అలాగే ఈ-కామర్స్ సైట్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుండి కూడా ఈ గాడ్జెట్‌లను కొనుగోలు చేయవచ్చు. అయితే బయట మార్కెట్లో తీసుకున్న దానికంటే ఈ కామర్స్ ఫ్లాట్ ఫాంలోఉత్తమ ఆఫర్‌లలో కొనుగోలు చేసుకోవచ్చు. అంతే కాదు ఈ సైట్‌ల నుండి EMIలో కూడా ఈ గాడ్జెట్‌లను కొనుగోలు చేయవచ్చు.

ఈ గాడ్జెట్లు ఎలా ఉపయోగపడతాయి.. ?

మనం ఎంత స్మార్ట్‌గా మారుతున్నామో, నేటితరంలోని దొంగలు కూడా అంతే వేగంతో స్మార్ట్‌గా మారుతున్నారు. తాళం ఎంత ఖరీదైన, పెద్దదైనా దొంగలు మాత్రం దాన్ని క్షణాల్లో పగలగొడుతున్నారు. కానీ అధునాతన యాంటీ-థెఫ్ట్ పరికరాలను కనుగొనడం దొంగలకు కష్టమైన పని. సాధారణంగా ఒక ఇంట్లో దొంగతనం నిరోధక గాడ్జెట్‌లను ఉపయోగిస్తే, ఆ ఇంట్లో దొంగతనం, దోపిడీ, చోరీ వంటి నేరాల కేసులు చాలా తక్కువగా నమోదవుతాయి. నేరం జరిగినా.. నేరాన్ని త్వరగా ఛేదించేందుకు ఈ గాడ్జెట్లు పోలీసులకు సహకరిస్తాయి. అందుకే మీ ఇంట్లో దొంగతనం నిరోధించే గాడ్జెట్‌లను అమర్చినట్లయితే దొంగలు మీ ఇంటికి దూరంగా ఉంటారు.

స్మార్ట్ డోర్‌బెల్..

స్మార్ట్ డోర్‌బెల్ సాధారణ డోర్‌బెల్ లాగా కనిపిస్తుంది. కానీ ఇందులో CCTV కెమెరాలు, మోషన్ సెన్సార్‌లు కూడా ఉన్నాయి. తద్వారా మీరు ప్రపంచంలోని ఏ మూల నుండి అయినా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఏ డోర్‌బెల్ రింగర్‌ని అయినా చూడవచ్చు, వారితో మాట్లాడవచ్చు. కొన్ని స్మార్ట్ డోర్‌బెల్ మోడల్‌లలో, మీరు ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని కూడా చూడవచ్చు. మీ ఇంట్లో స్మార్ట్ డోర్‌బెల్‌ను ఇన్‌స్టాల్ చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, మీ ఇంటికి వచ్చే డెలివరీ బాయ్‌లు, పని చేసే వ్యక్తులు, ఇంటి చుట్టూ తిరుగుతున్న వ్యక్తుల పై మీరు నిఘా ఉంచవచ్చు. మార్కెట్లో ఈ స్మార్ట్ డోర్‌బెల్ ధర రూ. 3,000 నుంచి రూ. 20,000 వరకు ఉంటుంది.

స్మార్ట్ లాక్ లు..

స్మార్ట్ లాక్‌లు, సాధారణ లాక్‌లా కాకుండా కీ లేకుండా వస్తాయి. కీ స్థానంలో పాస్‌వర్డ్ లేదా RFID (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) లేదా అనేక మోడల్‌లు ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో వస్తాయి. తద్వారా మీ కుటుంబం తప్ప మరెవరూ ఇంటి తాళాన్ని తెరవలేరు. స్మార్ట్ లాక్‌లకు కీ ఉండదు కాబట్టి కీని కోల్పోతారనే భయం ఉండదు. దీనితో పాటు, స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన యాప్ సహాయంతో కూడా స్మార్ట్ లాక్‌లను యాక్సెస్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ యాప్ సహాయంతో, మీరు తాత్కాలిక యాక్సెస్ కోడ్‌లను కూడా రూపొందించవచ్చు. వీటిని అతిథులు, గృహ సిబ్బందికి అందించవచ్చు. స్మార్ట్ లాక్‌లలో మీరు వారి యాక్టివిటీ లాగ్‌లను ట్రాక్ చేసే సదుపాయం కూడా ఉంది. అంటే లాక్ ఎప్పుడు తెరిచారు, ఎవరు తెరిచారు, ఎలా తెరిచారు, ఈ డేటా మొత్తాన్ని మీ ఫోన్‌లోనే మీరు తనిఖీ చేయవచ్చు. స్మార్ట్ లాక్‌ల ధర రూ.5,000 నుంచి రూ.30,000 మధ్య ఉంటుంది.

విండో సెన్సార్...

మీ ఇల్లు పెద్దగా ఉండి, దొంగలు ఇంట్లోకి ప్రవేశించడానికి బహుళ ఎంట్రీ పాయింట్లు ఉండవచ్చని మీరు భావిస్తే, ఖచ్చితంగా ఇంటి కిటికీలన్నింటిలో విండో సెన్సార్లను అమర్చాలి. విండో సెన్సార్లు చాలా చిన్నవిగా కిటికీలలో అమర్చి ఉంటాయి. విండో విరిగిపోయినా, బలవంతంగా తెరవడానికి ప్రయత్నించినా ఈ సెన్సార్‌లు మీ స్మార్ట్‌ఫోన్‌కు హెచ్చరికలను పంపుతాయి. విండో సెన్సార్‌లు మీ ఇంటి భద్రతలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. స్మార్ట్ లాక్‌లు, స్మార్ట్ డోర్‌బెల్స్, CCTV కెమెరాలు వంటివి ముందు నుండి కనిపించవు. కానీ రహస్యంగా మీ ఇంటిని సురక్షితంగా ఉంచుతాయి. మార్కెట్లో విండో సెన్సార్‌లను రూ. 2,000 నుంచి రూ. 10,000 రేంజ్‌లో తీసుకోవచ్చు.

Next Story

Most Viewed