లక్షల కొద్ది Gmail అకౌంట్లు డిలీట్.. గూగుల్ కీలక నిర్ణయం

by Disha Web Desk 17 |
లక్షల కొద్ది Gmail అకౌంట్లు డిలీట్.. గూగుల్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: టెక్ దిగ్గజం గూగుల్ వచ్చే నెలలో దాదాపు లక్షల కొద్ది Gmail అకౌంట్లను తొలగించనుంది. గత రెండేళ్లుగా నిరూపయోగంగా ఉన్నటువంటి అకౌంట్లను శాశ్వతంగా తొలగించనుంది. మే నెలలో గూగుల్ ఈ విషయాన్ని తన బ్లాగ్‌లో పేర్కొంది. వచ్చే డిసెంబర్ నుంచి విడతల వారీగా ఖాతాల డీయాక్టివేట్‌ను ప్రారంభించనుంది.

గత రెండేళ్ల కాలంలో ఒక్కసారి కూడా Gmail‌కు లాగిన్ కాకుండా ఉన్న అకౌంట్లను డీయాక్టివేట్‌ చేయడంతో పాటు డాక్స్, డ్రైవ్, Meet, క్యాలెండర్, ఫొటోలతో సహ ఇతర కంటెంట్ మొత్తాన్ని తొలగిస్తుంది. ఎక్కువ కాలం ఉపయోగించని అకౌంట్లకు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా ఉండదు, అలాగే సెక్యూరిటీ లోపాల కారణంగా ఆయా అకౌంట్లను వేరే వ్యక్తులు ఉపయోగించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది.

కనీసం రెండేళ్ల నుంచి వాడని అకౌంట్లను మాత్రమే తొలగించనున్నారు. అయితే స్కూళ్లు, బిజినెస్‌లకు సంబంధించిన వాటిని మాత్రం డియాక్టివేట్ చేయడం లేదు. యూజర్ల అకౌంట్ యాక్టీవ్‌గా ఉండాలంటే ఈ రెండేళ్ల కాలంలో ఒక్కసారైనా లాగిన్ అయి ఉండాలి. లేదా మెయిల్ పంపడం, ప్లేస్టోర్ నుంచి యాప్‌లు డౌన్‌లోడ్ చేయడం, ఇదే ఖాతాతో యూట్యూబ్ చూడటం, గూగుల్‌లో సెర్చ్ చేయడం, ఈ ఖాతాతో ఏదైనా థర్డ్ పార్టీ యాప్‌లకు లాగిన్ కావడం వంటివి చేసినట్లయితే వాటిని యాక్టివ్ అకౌంట్లుగా పరిగణిస్తారు.


Next Story