Google సెర్చ్‌లో AI ఫీచర్లు.. మరింత వేగంగా కంటెంట్..

by Disha Web Desk 17 |
Google సెర్చ్‌లో AI ఫీచర్లు.. మరింత వేగంగా కంటెంట్..
X

దిశ, వెబ్‌డెస్క్: సెర్చింజన్ గూగుల్ రోజు రోజుకు కొత్తగా అప్‌డేట్ అవుతూ వినియోగదారులకు కొత్త ఫీచర్లను అందిస్తుంది. తాజాగా గూగుల్ సెర్చ్ పేజీకి కొత్తగా కృత్రిమ మేధస్సు (AI) ఫీచర్‌లను యాడ్ చేశారు. దీని ద్వారా యూజర్లు ఏ విషయం గురించి సెర్చ్ చేయాలనుకున్న AI ద్వారా వేగంగా సమాధానాలు పొందవచ్చు. యూజర్లు ఇచ్చే కంటెంట్‌ను అర్థం చేసుకోడానికి గూగుల్ సెర్చింజన్‌కు AI- పవర్డ్ సెర్చ్ ఎక్స్‌పీరియన్స్ (SGE)కి కొత్త అప్‌గ్రేడ్‌లను గూగుల్ విడుదల చేసింది. యూజర్లు వెతికేటటువంటి ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సైన్స్‌తో పాటు ఇతర అన్ని రకాల అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను గూగుల్ AI ఫీచర్ ద్వారా సులభంగా పొందవచ్చు.

SGEకి కొత్త అప్‌గ్రేడ్ ఇప్పటికే ఆటోమెటిక్‌గా అందరి డివైజ్‌లలో అందుబాటులో ఉంది. మొదట్లో ఈ ఫీచర్ గురించి వినియోగదారుల నుంచి అభిప్రాయాలను తీసుకుని వారి అభిరుచులకు తగ్గట్లుగా కంటెంట్‌లను సులభంగా కనుక్కునేలా అప్‌డేట్‌ను తెచ్చారు. కొత్త AI ఫీచర్లతో, గూగుల్ ఇప్పుడు Microsoft Bing తో నేరుగా పోటీపడుతోంది. గూగుల్ ఇటీవలే ఈ సంవత్సరం జనరేటివ్ AI ప్లాట్‌ఫారమ్ బార్డ్‌ను ప్రారంభించింది.

Next Story

Most Viewed

    null