సైబర్ కిడ్నాపింగ్.. సైబర్ నేరగాళ్ల సరికొత్త వ్యూహం.. తస్మాత్ జాగ్రత్త

by Disha Web Desk 20 |
సైబర్ కిడ్నాపింగ్.. సైబర్ నేరగాళ్ల సరికొత్త వ్యూహం.. తస్మాత్ జాగ్రత్త
X

దిశ, ఫీచర్స్ : కిడ్నాప్ అంటే ఏంటో ప్రతిఒక్కరికి తెలిసే ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా సైబర్ కిడ్నాపింగ్ పేరు విన్నారా ? అదేంటి సైబర్ కిడ్నాపింగ్ ఏంటి.. ఇలాంటి కిడ్నాప్ లు కూడా ఉంటాయా అనుకుంటున్నారా.. మరి దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అనుకుంటున్నారా.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా అమెరికాలోని ఉటానగరంలో వెలుగు చూసిన సైబర్ కిడ్నాపింగ్ అందరినీ కలిచివేసింది. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత సైబర్ కిడ్నాప్ కూడా జరుగుతుందా అని అనుకుంటారు. ఇంతకీ ఆ సైబర్ కిడ్నాప్ అంటే ఏమిటో తెలుసుకోవడం ప్రతిఒక్కరికి ముఖ్యం ?

సైబర్ కిడ్నాపింగ్ అంటే ఆన్‌లైన్‌ కిడ్నాపింగ్‌ గేమ్‌.. ఇందులో సైబర్‌ నేరగాళ్లు ఫోన్ వినియోగదారుల డేటాను సేకరించి ఫొటోలను మార్పింగ్‌ చేస్తారు. ఆ తరువాత వారు కిడ్నాప్‌ అయినట్టు సందేశాన్ని పిల్లలకు పంపుతారు. ఇందులో నుంచి తప్పించుకోవడానికి తనకుతానే స్వయంగా కిడ్నాప్‌ చేసుకోవాలని, ఫోన్‌ వాడకూడదని చెబుతారు. అంతే కాదు ఎవరూ లేని ప్రదేశంలో వెళ్లి కిడ్నాప్‌ అయినట్టు ఫొటోలు, వీడియోలను తీసి పిల్లలను డిమాండ్‌ చేస్తారు. పిల్లల నుంచి వచ్చిన ఫోటోలను వారి తల్లిదండ్రులకు పంపి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు. మీ పిల్లల్ని కిడ్నాప్‌ చేశాం.. డబ్బులిస్తే వదిలేస్తాం అంటూ బెదిరిస్తారు. ఫోటోలను చూసిన పేరెంట్స్ నేరగాళ్లు డిమాండ్ చేసినంత డబ్బులను ముట్టజెప్పుతారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సైబర్ కిడ్నాపింగ్ : ఈ 3 తప్పులు చేయకుండా ఉండండి..

మొదటి పొరపాటు : మీరు సైబర్ కిడ్నాప్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే, తెలియని నంబర్ల నుండి కాల్స్ తీసుకోకండి.

రెండవ తప్పు : ఎవరైనా మీకు తెలియని నంబర్ నుండి మీ కుటుంబ సభ్యుడిగా, స్నేహితునిగా నటిస్తూ మీకు కాల్ చేస్తే, జాగ్రత్తగా ఉండండి. కాల్‌ని డిస్‌కనెక్ట్ చేసిన తర్వాత, మీ ఫోన్ నుండి వారి నంబర్‌ను డయల్ చేసి చెక్ చేసుకోండి.

మూడవ తప్పు : సోషల్ మీడియా మనందరికీ విపత్తుగా మారుతుంది. మనం ఎక్కడికి వెళ్లినా ఫోటోలు, వీడియోలను క్లిక్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాము. ఈ డేటాను వినియోగించనున్నారు. అందుకే సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసే ముందు 100 సార్లు ఆలోచించడం మంచిది.


Next Story