అమెరికాలో టీనేజ్‌‌లకు ఇష్టమైన వీడియో ప్లాట్‌ఫామ్ ఏదో తెలుసా..?!

by Disha Web Desk 17 |
అమెరికాలో టీనేజ్‌‌లకు ఇష్టమైన వీడియో ప్లాట్‌ఫామ్ ఏదో తెలుసా..?!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో టీనేజ్‌లు(16 సంవత్సరాల కంటే తక్కువ) ఎక్కువగా YouTubeను ఇష్టపడుతున్నట్లుగా ఒక నివేదిక పేర్కొంది. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ పైపర్ శాండ్లర్ నివేదిక ప్రకారం, అమెరికాలో యుక్తవయస్కుల వారు రోజు వీడియోలను చూసే ప్లాట్‌ఫామ్‌లో 29.1 శాతంతో YouTube మొదటి స్థానంలో నిలవగా, 28.7 శాతంతో నెట్‌ఫ్లిక్స్‌ రెండో స్థానంలో ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో 9,000 కంటే ఎక్కువ మంది టీనేజ్‌‌లపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. మూడవ స్థానంలో ఇన్‌స్టాగ్రామ్ నిలిచింది. TikTok ఆదరణ 38 శాతం మెరుగుపడిందని నివేదిక పేర్కొంది. గత ఆరు నెలల్లో టీనేజ్‌లలో Spotify వాడకం 68 శాతం నుండి దాదాపు 70 శాతం పెరిగింది. అలాగే, 87 శాతం మంది యుక్తవయస్కులు ఐఫోన్‌ను కలిగి ఉన్నారని నివేదిక తెలిపింది.


Next Story