భారీగా డేటా వాడేస్తున్న 5జీ వినియోగదారులు

by Dishanational1 |
భారీగా డేటా వాడేస్తున్న 5జీ వినియోగదారులు
X

దిశ, టెక్నాలజీ: భారత్‌లో 5జీ వినియోగదారులు భారీగా డేటాను వాడేస్తున్నారని ప్రముఖ టెలికాం గేర్ తయారీ కంపెనీ నోకియా తన నివేదికలో వెల్లడించింది. 2022 అక్టోబర్‌లో దేశీయంగా 5జీ నెట్‌వర్క్ సేవలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి 4జీ వినియోగదారులతో పోలిస్తే 5జీ సబ్‌స్క్రైబర్లు 3.6 రెట్లు ఎక్కువ మొబైల్ డేటాను వినియోగిస్తున్నారు. 'మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్ ' పేరుతో నోకియా బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2023లో మొత్తం డేటా ట్రాఫిక్‌లో 15 శాతం 5జీదే కావడం గమనార్హం. 'గడిచిన ఐదేళ్ల కాలంలో వినియోగదారులు ఏడాదికి 26 శాతం వృద్ధితో నెలకు 17.4 ఎక్సాబైట్‌ల డేటాను వినియోగిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక డేటా వినియోగంలో ఒకటి. సగటున ఒక వ్యక్తి నెలకు 24జీబీల డేటాను వాడుతున్నాడు. ఇది భారత్‌లో డేటా వినియోగం అత్యధికంగా ఉందని సూచిస్తోందని' నోకియా ఇండియా, మార్కెటింగ్, కార్పొరేట్ వ్యవహారాల హెడ్ అమిత్ మార్వా చెప్పారు. దేశంలో 5జీ ట్రాఫిక్ ఉన్న టెలికాం సర్కిళ్లళో అధిక భాగం మెట్రో నగరాలదే. మొత్తం మొబైల్ డేటా ట్రాఫిక్‌లో 20 శాతం వీటిదేనని నివేదిక తెలిపింది. భవిష్యత్తులో 5జీ లభ్యత, పనితీరు, 5జీ పరికరాల ధరలు తగ్గడం, కొత్త డేటా ఆధారిత యాప్‌లు, సేవలతో 5జీ వృద్ధి మరింత వేగవంతం కానుందని నివేదిక పేర్కొంది.


Next Story