అఫ్గానిస్తాన్‌తో జాగ్రత్త.. టీమిండియాకు హర్భజన్‌ సింగ్‌ హెచ్చరిక

96

దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ జట్టుపై ఇండియా, న్యూజీలాండ్ జట్లు ఓడిపోవడంతో గ్రూప్ 2లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా మారాయి. ఇండియా – న్యూజీలాండ్ మధ్య ఆదివారం జరగబోయే మ్యాచ్‌ను ఫ్యాన్స్ క్వార్టర్ ఫైనల్‌లాగ భావిస్తున్నారు. కోహ్లీ సేన సెమీస్ చేరాలంటే న్యూజీలాండ్‌పై తప్పక గెలవాల్సి ఉంటుంది. ఆ తర్వాత భారత జట్టు అఫ్గానిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్ జట్లతో తలపడాల్సి ఉన్నది. వాటిలో అలవోకగా గెలుస్తుందన్న ధీమాతో న్యూజీలాండ్ మ్యాచే కీలకమని పలువురు భావిస్తున్నారు. అయితే టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాత్రం కేవలం న్యూజీలాండ్‌తో గెలిస్తే సరిపోదని.. అఫ్గానిస్తాన్ జట్టుతో కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు.

గ్రూప్ 2లో అఫ్గాన్ జట్టు కూడా బలమైనదేనని.. స్కాట్లాండ్ జట్టును 130 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అఫ్గాన్ జట్టులో అంతర్జాతీయ అనుభవం ఉన్న స్పిన్నర్లు ఉన్నారు. ఐపీఎల్ సహా పలు ఇతర లీగ్స్ ఆడుతూ ఎంతో పరిణితి చెందారు. వారిని భారత జట్టు తక్కువగా అంచనా వేయకూడదని భజ్జీ చెబుతున్నాడు. టీమ్ ఇండియా ముందుగా ఒత్తిడి తగ్గించుకొని కివీస్‌పై గెలవాలి.. ఆ తర్వాత అఫ్గానిస్తాన్‌పై గెలిస్తే తప్పకుండా సెమీస్ చేరుతుందని భజ్జీ అభిప్రాయపడ్డాడు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..