రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆల్‌రౌండర్

by  |
Team India all-rounder Stuart Binny
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ఆల్‌రౌండర్ స్టువర్ట్‌ బిన్నీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు తెలుపుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన చేశారు. కాగా, టీమిండియా తరుపున అతడు 6 టెస్టులు, 14 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 95 మ్యాచ్‌లు ఆడిన బిన్నీ 4796 పరుగులు చేసి, బౌలింగ్‌లో 146 వికెట్లు పడగొట్టాడు. 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో అద్భుతమైన ఘనత సాధించాడు. ఢాకా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియాకి ఘోర ఓటమి తప్పదని భావిస్తున్న తరుణంలో బాల్‌తో అద్భుతం సృష్టించిన స్టువర్ట్ బిన్నీ, 4 పరుగులకే 6 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని ఖాయం చేశాడు. నాటినుంచి క్రికెట్ అభిమానుల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. 2016లో వెస్టిండీస్‌పై చివరిసారిగా టీమిండియా తరపున టీ20 మ్యాచ్ ఆడాడు.



Next Story

Most Viewed