పాఠశాలలో కరోనా కలకలం.. ఆందోళనలో తల్లిదండ్రులు

by  |
students
X

దిశ, సత్తుపల్లి : వెలుగు మండల పరిధిలోని కాకర్లపల్లి, కొమ్ముగుడెం ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు కోవిడ్ సోకటంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తుగా విద్యార్థులకు ప్రాథమిక లక్షణాలు ఉన్న నేపథ్యంలో సోమవారం కాకర్లపాల్లి ప్రాథమిక పాఠశాలలో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 33 మంది విద్యార్ధులకు గాను 31మందికి నెగిటివ్ అని తేలింది. కేవలం ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్ రావడంతో గ్రామస్తులు, విద్యా శాఖ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

వెంటనే విద్యాశాఖ, గ్రామ సర్పంచ్ కంచర్ల రమాదేవి సహకారంతో పంచాయితీ సిబ్బంది పాఠశాలను పూర్తిగా శానిటైజ్ చేయించినట్లు హెచ్.ఎం రామిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఇటీవల కొమ్ముగుడేం యు.పి.ఎస్ పాఠశాలలో కూడా 3వ తరగతి విద్యార్థికి పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఈ పాఠశాలలో మొత్తం 53 విద్యార్థులకు గాను కరోనా భయంతో సోమవారం కేవలం 17 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. కుటుంబ సభ్యుల ద్వారా విద్యార్థులకు వ్యాధి సంక్రమించిందని, పాఠశాలలు యధావిధిగా నడుస్తాయని ఎం.ఈ.ఓ రాములు తెలిపారు.

ప్రభుత్వం పాఠశాలలను ఆర్భాటంగా ప్రారంభించి చేతులు దులుపుకుంది అని, కనీసం శానిటైజర్లు, మాస్కలు పంపిణీ చేయకపోవడం విద్యార్థుల భవిష్యత్తుకు శాపంగా మారిందని కిసాన్ మోర్చ రాష్ట్రా అధికార ప్రతినిధి ఉడతనేని అప్పారావు విమర్శించారు. సీ.ఎం కే.సీ.ఆర్ కు హుజూరబాద్ ఎన్నిక పై ఉన్న సోయి భావిభారత పౌరుల ఆరోగ్యం పై లేకుండ పోయిందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో బీజేపీ ఆద్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.


Next Story

Most Viewed