టీసీఎస్ సంస్థ అనూహ్య నిర్ణయం!

by  |
టీసీఎస్ సంస్థ అనూహ్య నిర్ణయం!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కాలంలోనూ కొన్ని సానుకూల వార్తలు వినిపిస్తున్నాయి. దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్ ఊహించని నిర్ణయం తీసుకుంది. టీసీఎస్ సంస్థలో ప్రస్తుతం 3.5 లక్షల మంది ఉద్యోగులున్నారు. వీరిలో 20 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే, భవిష్యత్తులో తమ ఉద్యోగుల్లో 75 శాతం మందిని ఇంటి నుంచి పనిచేసేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. 2025 ఏడాదిలోగా దశలవారీగా మొత్తం 75 శాతానికి పెంచాలనేది సంస్థ లక్ష్యమని వెల్లడించింది. ఈ విషయాన్ని గతంలోనే టీసీఎస్ సంస్థ ప్రస్తావించినప్పటికీ, అధికారికంగా శనివారం ప్రకటించింది. ‘వంద శాతం పనితీరు రాబట్టేందుకు ఆఫెసులో 25 శాతం కంటే ఎక్కువ ఉద్యోగులు అవసరమని మేము అనుకోవడంలేదు’ అని టీసీఎస్ స్వోవో ఎన్‌జీ సుబ్రమణ్యం చెప్పారు.

ఈ విధానం ద్వారా ఏ ఉద్యోగి అయినా, 25 శాతం మాత్రమే ఆఫీసులో పనిచేయవలసి ఉంటుందని, ఇది అన్ని బృందాలకు వర్తిస్తుందని ఆయన వివరించారు. కొవిడ్-19 అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ కొనసాగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీసీఎస్ ఉద్యోగులు ఇప్పటికే 90 శాతం మంది ఇంటి నుంచి పనిచేస్తున్నారు. దీనికోసం, కొన్నేళ్లుగా సంస్థ అభివృద్ధి చేసిన ఎస్‌బీడబ్ల్యూఎస్ వేదికను ఉపయోగిస్తున్నారు. టీసీఎస్ ఈ విధానాన్ని పూర్తీస్థాయిలో అమలుపరిస్తే..మిగిలిన ఐటీ సంస్థలు సైతం ఇదే బాటలో నడుస్తాయని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘తాము పటిష్టమైన వ్యూహంతోనే ముందుకు వచ్చాం. తమ సంస్థ విధానం గతం కంటే చాలా మెరుగ్గా ఉందని నిరూపించడమైంది. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తే ఆఫీసులకు నిర్వహణ ఖర్చులు చాలావరకూ తగ్గుతాయని టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేశ్ గోపీనాథన్ పేర్కొన్నారు.

tAGS: TCS, TCS Employees, TCS Work From Home, Coronavirus In India, Coronavirus India



Next Story

Most Viewed