టాటా స్టీల్ లాభంలో క్షీణత

by  |
టాటా స్టీల్ లాభంలో క్షీణత
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ నికర లాభం 62.69 శాతం తగ్గి రూ. 1,546.28 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 4,144.71 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 7.44 శాతం పెరిగి రూ. 37,153 కోట్లకు చేరుకుంది.

‘టాటా స్టీల్ బలమైన నగదు, వాల్యూమ్‌ల వృద్ధి కారణంగా మెరుగైన ఫలితాలను సాధించింది. సంస్థ పటిష్టత, ఉద్యోగుల నిబద్ధతతో కొవిడ్-19 సంబంధిత సవాళ్లను అధిగమించి సామర్థ్యాన్ని పెంచాయి. ఇది అధిక అమ్మకాలను సాధించడంలో దోహదపడిందని’ టాటా స్టీల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ టి వి నరేంద్రన్ తెలిపారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల లాభం 23.35 శాతం తగ్గి రూ. 2,606 కోట్లకు చేరుకుంది. అయితే, ఇది త్రైమాసిక ప్రాతిపదికన 534 శాతం పెరిగిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్లు శుక్రవారం 3 శాతం పెరిగి రూ. 487.50 వద్ద ముగిసింది.

Next Story

Most Viewed