టాటా స్కై చందాదారుల కోసం తగ్గింపులు!

by  |
టాటా స్కై చందాదారుల కోసం తగ్గింపులు!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న తమ ఖాతాదారులను కాపాడుకునేందుకు టాటా స్కై ఖాతాదారుల సబ్‌స్క్రిప్షన్ ధరలను తగ్గించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ టాటా స్కైలో 50 లక్షల మంది చందాదారులున్నారు. వీరిని కాపాడుకోవడానికే సబ్‌స్క్రిప్షన్ ప్యాక్ ధరలను తగ్గించడానికి నిర్ణయించింది. కరోనా వల్ల ఉద్యోగులు, స్వయం ఉపాధి ఉన్న వారిపై ప్రభావం అధికంగా ఉందని, ఇదివరకే చందాదారుల ఆలోచనా విధానాలపై సర్వే చేయించిన టాటా స్కై, మొత్తం చందా దారుల్లో 70 శాతం మంది సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకోవడానికి లేదంటే ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నాల్లో ఉన్నట్టు తేలింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని నెలవారీ ఖర్చులను తగ్గించాలని ఆలోచిస్తోంది. అందులో భాగంగా తమ యూజర్స్ బిల్లును రూ.350 కంటే తక్కువగా, ప్రత్యేక ప్యాక్‌లు ఉండేలా మార్పులు చేస్తోంది. టాటా స్కై నిపుణులు సూచనల మేరకు ఖర్చులు తక్కువుండే ప్యాక్స్‌ను అందించాలని నిర్ణయించింది. చందాదారులు సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకోకుండా కాపాడుకోవాలని భావిస్తోంది. మార్చిలో కరోనా వ్యాప్తి పెరిగినప్పటి నుంచి టాటా స్కై 15 లక్షల మంది చందాదారులను కోల్పోయింది. వారిని తిరిగి రప్పించేందుకు, ఉన్నవారిని కాపాడుకునేందుకు ఈ మార్పులు దోహదం చేస్తాయని టాటా స్కై భావిస్తోంది. కొత్తగా రాబోయే మార్పులతో నెలవారీ ప్యాక్‌లో కనీసం రూ. 100 వరకూ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.


Next Story

Most Viewed