తమిళనాడు బీజేపీ చీఫ్ అరెస్ట్ 

by  |
తమిళనాడు బీజేపీ చీఫ్ అరెస్ట్ 
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్నా బీజేపీ నేతలు ప్రారంభించిన వెట్రి వేల్ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ తమిళనాడు చీఫ్ ఎల్ మురుగన్‌ తోపాటు 100 మంది పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రథయాత్ర తీరులో రాష్ట్రంలో నెలరోజుల (నవంబర్ 6 నుంచి డిసెంబర్ 6 వరకు) పాటు ఆరు ఆధ్యాత్మిక ప్రాంతాలను కలుపుతూ బీజేపీ వెట్రి వేల్ యాత్రను తలపెట్టింది. కానీ, ఈ యాత్రతో కరోనా కేసుల పెరిగే ప్రమాదముందని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి.

ఈ నేపథ్యంలోనే యాత్రకు అనుమతివ్వడం లేదని పళనిస్వామి సర్కారు వెల్లడించింది. అయినప్పటికీ యాత్ర చేపట్టడానికి మురుగన్ సహా బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, హెచ్ రాజా, సీటీ రవి, అన్నమలైలు శుక్రవారం చెన్నై నుంచి తిరుత్తనికి చేరారు. సీనియర్ నేతుల ఓపెన్ వెహికిల్స్‌లో యాత్ర ప్రారంభించగా కార్యకర్తలు బీజేపీ జెండాలు పట్టుకుని చుట్టూ గుమిగూడారు. పోలీసులు వెంటనే సమూహాన్ని అడ్డుకున్నారు. నేతలను ముందు జాగ్రత్తగా కస్టడీలోకి తీసుకున్నారు. వారంతా 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed