లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్ కృష్ణ అదిత్య

by  |
collector krishna aditya
X

దిశ, ములుగు : ఈ నెల 11న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రజలను కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఈ నెల 11న ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగు జిల్లాలోని లోక్ అదాలత్‌లో క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, ఫ్రీ లిటిగేషన్, బ్యాంకు, ఎలక్ట్రిసిటీ, భూతగాదాల కేసులు, వివాహ, కుటుంబ తగాదాల కేసులు, మోటార్ బైక్ యాక్సిడెంట్ కేసులు, చిట్ ఫండ్, చెక్ బౌన్స్ వంటి కేసులు ఇరువర్గాలు రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

జిల్లాలోని ఆయా మండలాల ఎంపీడీవోలు, సర్పంచ్ లు వారివారి పరిధుల్లో పైన తెలిపిన కేసులు ఉన్నట్లు అయితే లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించబడునని ప్రజలకు తెలిసే విధంగా టాం టాం నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకునే విధంగా అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.



Next Story

Most Viewed