లండన్‌లో బాలీవుడ్ స్టైల్ ఛేజింగ్.. ట్విట్టర్‌లో వైరల్

by  |
Rahul-and-a-brown-wallet
X

దిశ, ఫీచర్స్ : రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లేటపుడు ఎవరిదైనా పర్స్ దొరికితే.. ఏం చేస్తారు? మంచి వాళ్లయితే అందులో ఉన్న అడ్రస్‌కు పంపేందుకు ప్రయత్నిస్తారు. ఎటువంటి సమాచారం లభించకుంటే తమ దగ్గరే ఉంచుకుంటారు. అంతే తప్ప దానికోసం టైమ్ వేస్ట్ చేసుకోరు. కానీ పాకిస్థాన్‌కు చెందిన ఘాజీ తైమూర్.. లండన్ వీధుల్లో తనకు దొరికిన వ్యాలెట్‌ ఎవరిదో తెలుసుకుని, అతనికి అందజేసేందుకు చేసిన సెర్చ్ నిజంగా బాలీవుడ్ మూవీని తలపించింది. ప్రస్తుతం ఈ స్టోరీ ట్విట్టర్ యూజర్లను కట్టిపడేస్తోంది.

లండన్‌లో నివాసముండే ఇండియన్ రాహుల్ తన వ్యాలెట్ పోగొట్టుకోగా.. అక్కడి షోర్‌డిచ్ సిటీలో నివాసముంటున్న పాకిస్థానీ ఘాజీ తైమూర్‌కు దొరికింది. వెంటనే ఆ బ్రౌన్ కలర్ పర్స్ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన తైమూర్.. ఓనర్‌ను పట్టుకునేందుకు వేట మొదలుపెట్టాడు. అందులోని బ్యాంక్ కార్డ్స్‌పై ఉన్న ‘రాహుల్’ అనే పేరు ఆధారంగా సోషల్ మీడియాలో హంట్ స్టార్ట్ చేశాడు.

అయితే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఎక్కడ కూడా తన ఆచూకీ లభించలేదు. దీంతో ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్‌లో వెతకగా.. రాహుల్ పేరుతో లండన్‌లో పనిచేస్తున్న ముగ్గురి ప్రొఫైల్స్ కనబడ్డాయి. కానీ అవి లాక్ చేసి ఉండటం నిరాశకు గురిచేసింది. ఇన్ని ప్రయత్నాల తర్వాత మామూలు వ్యక్తులు ఎవరైనా మనకెందుకులే అని వదిలేస్తారు. కానీ తైమూర్ మాత్రం అక్కడితో ఆగిపోలేదు. ఈసారి రాహుల్ ఆఫీస్ అడ్రస్ కనుక్కునేందుకు సిద్ధమయ్యాడు.

మొదటి నుంచి తైమూర్ అటెంప్ట్స్ అన్నీ ఏదోవిధంగా ఫెయిల్ అవుతున్నట్టే.. రాహుల్ ఆఫీస్ అడ్రస్ కనుక్కోవడంలో ఈ సారి గూగుల్ మ్యాప్స్‌ ఫెయిల్ అయింది. అయినా వదల్లేదు.. ‘కంపెనీస్ హౌస్‌’లో ఫైల్ చేసిన యాన్యువల్ అకౌంట్స్ ఆధారంగా ఎట్టకేలకు ఆఫీస్ అడ్రస్ కనుక్కొన్నాడు. ఈ మేరకు ‘రాహుల్‌ను కలుసుకునేందుకు అడుగు దూరంలోనే ఉన్నా’ అంటూ ‘కభీ ఖుషీ కభీ గమ్’ మూవీలో హృతిక్.. షారుఖ్‌ను వెతికే సీన్ షేర్ చేశాడు. అంతేకాదు రాహుల్‌ను కలిశాక సిచ్యువేషన్‌ను ఊహిస్తూ కాజోల్(అంజలి).. షారుఖ్(రాహుల్) వైపు పరుగెత్తుకుంటూ వచ్చే సీన్‌ను గుర్తుచేస్తూ చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంది. తర్వాత ఏం జరగబోతుందనే ఆసక్తిని కలిగించింది.

ఫైనల్‌గా రాహుల్‌ను తన ఆఫీస్‌లోనే మీట్ అవడంతో నెటిజన్ల ఉత్కంఠకు తెరపడింది. ఫైనాన్స్ మేనేజర్ అయిన రాహుల్, తనను పట్టుకునేందుకు తైమూర్ చేసిన ప్రయత్నాలు విని కంటతడి పెట్టుకున్నాడు. అంతేకాదు తన బ్రౌన్ కలర్ వ్యాలెట్‌ను చేతిలో పట్టుకుని ఫొటోకు పోజిచ్చాడు. కాగా ఈ ట్వీట్ వేటను ఇంట్రెస్టింగ్‌గా నెరేట్ చేసిన విధానంపై నెటిజన్లు తైమూర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.


Next Story

Most Viewed