సుశాంత్ ది సూసైడ్ కాదు.. హత్యే : నారాయణ్ రాణే

by  |
సుశాంత్ ది సూసైడ్ కాదు.. హత్యే : నారాయణ్ రాణే
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ది ఆత్మహత్య కాదని… హత్య అని మహారాష్ట్రకు చెందిన బీజేపీ సీనియర్ నేత నారాయణ్ రాణే అన్నారు. దానిని ఆత్మహత్యగా చూపించడానికి ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారని, ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో దాస్తోందని, ఎవరినో రక్షించడానికి యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. (బీహార్ సీఎం నితీష్ కుమార్ సీబీఐ విచారణకు సిఫారసు చేయగా.. మహా సర్కార్ అందుకు నిరాకరిస్తోందని ఆరోపించారు. ‘ఇది ఆత్మహత్య కాదు.. మర్డర్ .. ఇప్పటికి 50 రోజులు గడిచిపోయాయి.. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ముంబై పోలీసులు కూడా ఈ కేసులో హంతకుల జాడ కనిపెట్టలేకపోయారు’ అని నారాయణ్ రాణే వ్యాఖ్యానించారు.

20 రోజులకు పైగా సుశాంత్‌ను ఎవరు బెదిరిస్తూ వచ్చారు? ప్రతిరోజూ ఆయన సిమ్ కార్డులు మారుస్తూ వచ్చాడు.. దీనిపై దర్యాప్తు ఎందుకు జరగడం లేదు? ఎవరినో కాపాడడానికి యత్నిస్తున్నారని అర్థమవుతోంది’ అని రాణే స్పష్టంచేశారు.

జూన్ 13 న సూరజ్ పంచోలీ ఇంట్లో జరిగిన విందుకు హాజరైన వారిని ఎందుకు విచారించడంలేదని ఆయన ప్రశ్నించారు. ఇక దినూ మోరియా ఎవరనీ, ఆయన ఇల్లు సుశాంత్ ఇంటి దగ్గరే ఉందని, పలువురు మంత్రులు దినూ ఇంటికి వెళ్లారని, ఆ రోజున పార్టీ ముగిసిన అనంతరం అందరూ అక్కడినుంచి సుశాంత్ ఇంటికి వెళ్లారని రాణే చెప్పారు. ఈ అన్ని ఘటనలపై దర్యాప్తు జరగాలన్నారు. సుశాంత్ ఆయన మాజీ మేనేజరు దిశా శాలియన్ సూసైడ్ కేసులను రెండూ కలిపి వీటిపై సమగ్ర విచారణ, దర్యాప్తు జరగాలని నారాయణ్ రాణే డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed