ఆత్మహత్యకు కొద్ది నిమిషాల ముందు..

by  |
ఆత్మహత్యకు కొద్ది నిమిషాల ముందు..
X

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇన్‌సైడర్స్, ఔట్‌సైడర్స్ అనే పక్షపాత ధోరణి హిందీ చిత్ర సీమలో ఎక్కువగా ఉందనే విషయం మరోసారి తెరపైకి రాగా అభిమానుల ఆందోళనలు ఉధృతమయ్యాయి. నెపోటిజం కారణంగానే సుశాంత్ డిప్రెషన్‌కు లోనై చనిపోయాడని.. వారసత్వంతో ఇండస్ట్రీలో పాతుకుపోయిన నటులు, నిర్మాతలు, దర్శకులకు నిద్ర లేకుండా చేశారు. దీంతో కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పగా.. ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ చాలా మంది నటీనటులను అన్‌ఫాలో అయ్యారు. ఇప్పటికీ ఈ నిరసనలు కొనసాగుతుండగా.. సుశాంత్ మరణంపై సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు ఫ్యాన్స్.

ఇదిలా ఉంటే, సుశాంత్ చనిపోయే ముందు తన పేరును చాలా సార్లు గూగుల్ చేసినట్లు పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్‌లో తేల్చారు. సుశాంత్ ఫోన్, లాప్ టాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. జూన్ 14న ఉ: 10: 15 నిమిషాలకు తన పేరును గూగుల్‌లో సెర్చ్ చేసుకున్నట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలినట్లు వెల్లడించారు. అంటే ఆత్మహత్య చేసుకునే కొద్ది నిమిషాల ముందు వికీపీడియాలో తన బయోడేటా చెక్ చేసుకున్నాడు సుశాంత్. ఆ టైమ్‌లో జ్యూస్ తీసుకున్న సుశాంత్.. తన గురించి కొన్ని ఆర్టికల్స్ కూడా చదివినట్లు సమాచారం.

అంతకు ముందు కూడా సుశాంత్ తన ఆర్టికల్స్ చదివి టీమ్‌తో డిస్కస్ చేసేవాడని తెలుస్తోంది. కొన్ని మీడియా సంస్థలు రాసిన ఆర్టికల్స్‌లో తన పేరు ఉండటాన్ని గమనించిన సుశాంత్.. తన పేరు చెడగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని విచారణలో వెల్లడైంది. కాగా ఇంతకుముందు పోస్ట్ మార్టం రిపోర్ట్.. సుశాంత్ ఉరేసుకుని చనిపోయాడని నిర్ధారించగా, ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు 28 మంది సెలబ్రిటీలను అధికారులు విచారించారు. వీరిలో తన చివరి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, తన చివరి సినిమా హీరోయిన్, సంజన సంఘీతో పాటు బెస్ట్ ఫ్రెండ్ సందీప్ సింగ్ కూడా ఉన్నాడు. అంతే కాదు యశ్ రాజ్ ఫిల్మ్స్‌తో ఉన్న సుశాంత్ అగ్రిమెంట్‌ను కూడా అధికారులు పరిశీలించారు.



Next Story

Most Viewed