బాంబే హైకోర్టు జడ్జికి సుప్రీంకోర్టు షాక్

by  |
supreme court
X

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసుల్లో రెండు వివాదాస్పద ఆదేశాలు వెలువరించిన బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేదివాలాపై సుప్రీంకోర్టు వేటువేసింది. బాంబే హైకోర్టులో జస్టిస్ పుష్ప గనేదివాలాకు శాశ్వత హోదా కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను ఉపసంహరిచుకుంది. లైంగిక వేధింపుల కేసులకు సంబంధించి సదరు న్యాయమూర్తికి మరింత అవగాహన పెరగాల్సిన అవసరముందన్న కారణంతో ఆమె శాశ్వత హోదా ధ్రువీకరణను కొలీజియం వాయిదా వేసినట్టు సంబంధితవర్గాలు వెల్లడించాయి.

దుస్తులు లేకుండా ఎదను నేరుగా తాకితేనే పోక్సో చట్టం కింద లైంగిక వేధింపుగా పరిగణించలేమని ఈ నెల 19న జస్టిస్ పుష్ప గనేదివాలా రూలింగ్ ఇచ్చారు. బాధితురాలి చేయి పట్టుకోవడం లేదా ప్యాంటు జిప్పు విప్పడం కూడా లైంగిక వేధింపు పరిధిలోకి రాదని గురువారం వ్యాఖ్యానించారు. ఈ తీర్పులపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమెకు శాశ్వత హోదా కల్పించే సిఫారసులను కొలీజియం వెనక్కి తీసుకుంది. ఆమె న్యాయవాదిగా ఉన్నప్పుడు ఇలాంటి కేసులను బహుశా ఎక్కువగా వాదించి ఉండకపోవచ్చునని, ఆమెకు మరింత శిక్షణ అవసరమని భావిస్తున్నట్టు సమాచారం. సాధారణంగా ఒక జడ్జీకి శాశ్వత హోదా కల్పించడం, లేదా శాశ్వత జడ్జీని నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది. తర్వాత వాటిని కేంద్రం ఆమోదిస్తుంది.



Next Story

Most Viewed