మధ్య కేరళలో ఆ పార్టీకి మద్దతు

by  |
మధ్య కేరళలో ఆ పార్టీకి మద్దతు
X

దిశ,వెబ్ డెస్క్: కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అక్కడ రాజకీయ వేడి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించుకోవడానికి పలు పార్టీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇందులో భాగంగా కేరళలో ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉన్న మధ్య కేరళ ఇప్పడు కీలక రాజకీయ రంగంగా అవతరించింది. రాష్ట్ర జనాభాలో 18.38 శాతం ఉన్న కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి పఠనమిట్ట జిల్లాలో 33 సీట్ల ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ఎప్పటినుంచో కాంగ్రెస్‌కు మద్దతుదారుగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు వామపక్ష, బీజేపీని ఆకర్షిస్తుంది.

అయితే, రాష్ట్రంలో అతిపెద్ద క్రైస్తవ పార్టీ అయిన కేరళ కాంగ్రెస్ అధికారికంగా విడిపోయిన తరువాత జరిగే మొదటి అసెంబ్లీ ఎన్నిక ఇది. కేరళ కాంగ్రెస్ (ఎం) గత నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్‌కు మిత్రపక్షంగా ఉండగా, ఇప్పుడు పార్టీ దివంగత చైర్మన్ కెఎమ్ మణి కుమారుడు జోస్ కె మణి నేతృత్వంలోని పార్టీ అధికారిక వర్గం సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌కు మారిపోయింది. ఎల్ఎఫ్‌కెసీ (ఎం) కి ఇచ్చిన 13 సీట్లు రావాలంటే దానికి క్రైస్తవ ఓటు చాల ముఖ్యం. అయితే పార్టీ కార్యకర్తల నిరసనలు ఉన్నప్పటికీ, సీపీఎం కెసీ పఠనమిట్టలో గత 25 సంవత్సరాలుగా ఓట్లను సంపాదిస్తుంది. మరోవైపు ప్రముఖ జోసెఫ్ నేతృత్వంలో ప్రత్యర్థి కెసీ వర్గం యుడిఎఫ్‌తో చేరింది. అయితే వీరికి కొట్టాయం ,ఇడుక్కి ,పఠనంతిట్టలో 9 నుంచి 10 సీట్లు వచ్చే అవకాశం ఉంది.

క్రైస్తవ ఓట్లనే లక్ష్యంగా చేసుకున్నారు..

యుడిఎఫ్ మిత్ర పక్షం అయినా ఐయుఎంల్ వలన సీపీఎం ,బీజేపీ రెండు పార్టీలు క్రైస్తవ ఓటర్లను ఆకర్షించడంలో కొంత విఫలమవుతున్నారు. అయితే ఈ ప్రచారంలో సీపీఎం యుడిఎఫ్ మితవాద సంస్థ జమాత్ ఇస్లామిల వంతెనా అని ఆరోపించగా , బీజేపీ మాత్రం తన ప్రచారంలో క్రైస్తవ, ఉన్నత కులాల హిందూ ఓటర్లను ఒక చోట చేర్చే ప్రయత్నం చేస్తుంది. ముస్లీం ఉగ్రవాదం, లవ్ జిహాద్ సమస్యను కూడా బీజేపీ ఈ ప్రచారంలో లేవనెత్తనుంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో మధ్య కేరళలోని కొన్ని పంచాయతీలను బీజేపీ గెలుచుకుంది. దీంతో బీజేపీకి కొంత వరకు క్రైస్తవ మద్దతు కనిపిస్తుంది. దీంతో ఇప్పడు రాబోయే ఎన్నికలలో క్రైస్తవ ఓట్లు ప్రధానంగా ఎల్‌డీఎఫ్, యుడీఎఫ్‌లకి వెళ్తాయని భావిస్తున్నప్పటికీ బీజేపీ వలన కొంత వరకు ఓట్ల చీలిక ఏర్పడుతుంది అంటున్నారు.



Next Story

Most Viewed