సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ -155

by  |
సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ -155
X

దిశ, వెబ్‌డెస్క్ : టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రారంభం నుంచే నిలకడగా ఆడుతూ వచ్చింది. ఓపెనర్లు రాబిన్ ఉతప్ప, బెన్ స్టోక్స్ మంచి ఆట తీరును కనబరిచారు. స్ట్రైక్ రోటెట్ చేస్తూ త్వరగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మూడో ఓవర్లో బెన్ స్టోక్స్ కొట్టిన బంతికి పరుగు రాబట్టే క్రమంలో జాసన్ హోల్డర్ రాబిన్ ఉతప్ప 19(13)ను రన్ ఔట్ చేశాడు. దీంతో 30-1 స్కోర్ వద్ద ఆర్ ఆర్ తొలివికెట్‌ను కోల్పోయింది.

ఆ తర్వాత మూడో డౌన్‌లో బ్యాటింగ్‌కు సంజూ శ్యాంసన్, స్టోక్స్ కలిసి క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తూనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో తొలిస్ట్రాటజిక్ సమయానికి రాజస్థాన్ జట్టు 68-1(9.0) పరుగులు చేసింది.

అనంతరం హైదరాబాద్ బౌలర్లు తమ పంజా విసిరారు. కట్టడిగా బౌలింగ్ చేస్తూ త్వరత్వరగా వికెట్లు పడగొట్టారు. సంజూశ్యాంసన్ 36(26)ను జాసన్ హోల్టర్ బోల్డ్ చేయగా.. బెన్ స్టోక్స్‌ 30(32)ను రషిద్ ఖాన్ కుప్పకూల్చాడు. ఆ వెంటనే జాస్ బట్లర్ 9(12) కూడా విజయ్ శంకర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి నదీమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రెండోస్ట్రాటజిక్ సమయానికి RR జట్టు 110-4 (16) కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది.

చివర నాలుగు ఓవర్ల ఉండగా బ్యాటింగ్ కు దిగిన ప్రాగ్ పరావాలేదని పించాడు. కెప్టెన్ స్మిత్19(15) కూడా క్రీజులో ఎక్కువసేపు ఉండలేకపోయాడు. హోల్డర్ వేసిన బంతిని భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్ చేరాడు. ఆ మరుసటి బంతిని రియాన్ ప్రాగ్ 20(12) బౌండరీ మలిచే క్రమంలో డేవిడ్ వార్నర్‌కు దొరికిపోయాడు. మిగతా ప్లేయర్లు అర్చర్ 16(7), తెవాటియా 2(3) పరుగులు రాబట్టడంతో రాజస్థాన్ జట్టు నిర్టీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.

స్కోరు బోర్డు :

Rajasthan Royalls Innings :

రాబిన్ ఉతప్ప 19(13) r అండ్ b జేసన్ హోల్దర్, సంజూ శ్యాంసన్ 36(26) b జాసన్ హౌల్డర్, బెన్ స్టోక్స్ 30(32) b రషీద్ ఖాన్, జాస్ బట్లర్ 9(12) c నదీమ్ b విజయ్ శంకర్, స్టీవ్‌స్మిత్ 19(15) c మనీష్ పాండే b జాసన్ హోల్డర్, రియాన్ ప్రాగ్ 20(12) c డేవిడ్ వార్నర్ b జాసన్ హోల్డర్

ఎక్స్‌ట్రాలు : 3 – మొత్తం స్కోరు : 154/6

వికెట్ల పతనం : 30-1 (రాబిన్ ఉతప్ప, 3.3), 86-2 (సంజూ శ్యాంసన్, 11.4) 86-3 (బెన్ స్టోక్స్, 12.1), 110-4 (జాస్ బట్లర్, 15.3), 134-5 (స్టీవ్ స్మిత్, 18.1), 135-6 ( రియాన్ ప్రాగ్,18.2)

బౌలింగ్ : సందీప్ శర్మ 4-0-31-0, జాసన్ హోల్దర్ 4-0-33-3,
విజయ్ శంకర్ 3-0-15-1, టి. నటరాజన్ 4-0-46-0, రషిద్ ఖాన్ 4-0-20-1, షాబాజ్ నదీమ్ 1-0-9-0

Next Story