ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య

by Disha Web Desk 23 |
ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
X

దిశ,మంచిర్యాల : ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని, తాండూరు మండలం అచ్చులపూర్ గ్రామానికి చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మృత్యువాత పడ్డారు.

తాండూరు మండలం అచలపూర్ గ్రామానికి చెందిన మైధం సాత్విక్ (18) అనే విద్యార్థి ఇంటర్మీడియట్ లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాండూర్ ఎస్సై జగదీష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మైథం నారాయణ కుమారుడు అయిన సాత్విక్ బెల్లంపల్లి ప్రగతి జూనియర్ కళాశాలలో ఎంపీసీ చదువుతున్నాడు. బుధవారం వెల్లడైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో పలు సబ్జెక్టులలో ఫెయిల్ కావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు .ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మంచిర్యాల జిల్లా దొరగారిపల్లేలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్‌ విద్యార్థిని తేజశ్విని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ఫెయిల్‌ కావడంతో మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్ట్‌మార్టం నిమిత్తం తేజశ్విని మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed