తెలంగాణ జాగ్రఫీ - రవాణా వ్యవస్థ: (గ్రూప్స్ స్పెషల్)

by Disha Web Desk 17 |
తెలంగాణ జాగ్రఫీ - రవాణా వ్యవస్థ: (గ్రూప్స్ స్పెషల్)
X

తెలంగాణ రాష్ట్రం భూపరివేష్టిత రాష్ట్రం..

తెలంగాణలో రోడ్డు నెట్‌వర్క్ 4 రకాలుగా ఉంటాయి. అవి

జాతీయ హైవేలు, రోడ్లు బల్డింగ్ డిపార్ట్‌మెంట్ నిర్వహించే రోడ్డు, పంచాయత్‌రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ నిర్వహించే గ్రామీణ రోడ్లు, జీహెచ్‌ఎంసి నిర్వహించే రోడ్లు.

రోడ్డు నెట్‌వర్క్ ఈ విధంగా..

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రోడ్ల పొడవు 1,07,871 కి.మీ అనగా జాతీయ హైవేలు, రోడ్లు&బిల్డింగ్, పంచాయతీ రాజ్, జి.హెచ్.ఎం సీ శాఖలు నిర్వహించే రోడ్లు.

తెలంగాణ రాష్ట్రం గుండా 23 జాతీయ హైవేలు వెళుతున్నాయి. ఈ జాతీయ హైవేల మొత్తం పొడవు 3,910 కి.మీ

రాష్ట్రంలోని మొత్తం జాతీయ హైవేలలో 5 జిల్లాల గుండా 31% జాతీయ హైవేలు వెళ్తున్నాయి. అవి నల్లగొండ, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, సంగారెడ్డి, ఖమ్మం.

అత్యధిక పొడవైన రోడ్డు నెట్‌వర్క్ గల తెలంగాణ జిల్లా నల్లగొండ జిల్లా.

పాతజిల్లాల వారీగా అత్యధిక పొడవైన రోడ్డు నెట్‌వర్క్ గల మొదటి నాలుగు జిల్లాలు వరుసగా నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్.

జిల్లాల వారిగా అత్యల్ప పొడవైన రోడ్డు నెట్‌వర్క్‌గల చివరి నాలుగు జిల్లాలు వరుసగా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హన్మకొండ, ములుగు.

2020-21 నాటికి తెలంగాణ రాష్ట్రంలో జాతీయ హైవే రోడ్డు మొత్తం పొడవు 3,910 కి.మీ

జిల్లాల వారీగా అత్యధిక జాతీయ హైవేల రోడ్డు పొడవు గల మొదటి నాలుగు జిల్లాలు వరుసగా నల్గొండ, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, సంగారెడ్డి.

జిల్లాల వారీగా అత్యల్ప జాతీయ హైవేల రోడ్డు పొడవు గల చివరి నాలుగు జిల్లాలు పెద్దపల్లి, హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల, జోగులాంబ గద్వాల్.

అత్యధికంగా ఆర్‌అండ్‌బి రోడ్డుగల జిల్లా ఖమ్మం.

అత్యల్పంగా ఆర్‌అండ్‌బి రోడ్డుగల జిల్లా మేడ్జల్ మల్కాజ్‌గిరి

ఆర్ అండ్ బి రోడ్డు లేని జిల్లా హైదరాబాద్.

అత్యధికంగా పంచాయతీ రాజ్ రోడ్డు గల జిల్లా నల్గొండ.

అత్యల్పంగా పంచాయతీరాజ్ రోడ్డుగల జిల్లా మేడ్చల్ మల్కాజ్‌గిరి

పంచాయతీరాజ్ రోడ్డు లేని జిల్లా హైదరాబాద్.

రోడ్డు సాంద్రత:

రోడ్డు సాంద్రత అనగా ప్రతి వంద చదరపు కి.మీలకు ఎన్ని కి.మీ. రోడ్డు ఉంటుందో, దానినే రోడ్డు సాంద్రత అంటారు.

తెలంగాణ రాష్ట్ర సరాసరి రోడ్డు సాంద్రత 96.24 కి.మీ

జిల్లాల వారీగా అత్యధిక రోడ్డు సాంద్రత గల మొదటి నాలుగు జిల్లాలు వరుసగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం.

జిల్లాల వారీగా అత్యల్ప రోడ్డు సాంద్రత గల చివరి నాలుగు జిల్లాలు వరుసగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్.

ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు:

ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ సిటీలో సరాసరి రేడియల్ దూరంలో చుట్టూర ఉండబోతుంది.

దీనిని భారత ప్రభుత్వం, సూత్రప్రాయంగా రెండు భాగాలుగా విడదీసింది.

ఉత్తర భాగం, దక్షిణ భాగం.

ఉత్తర రీజనల్ రింగ్‌రోడ్డు సంగారెడ్డి (161వ జాతీయ హైవే మీద) నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవపూర్, భువనగిరి, చౌటుప్పల్ (65వ జాతీయ హైవే మీద) మీదుగా వెళుతుంది.

దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్డు చౌటుప్పల్ (65వ జాతీయ రహదారి) షాద్‌నగర్, సంగారెడ్డి మీదుగా వెళుతుంది.

హైదరాబాద్ మెట్రో రైలు:

ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 69 కి.మీ పొడవుతో సేవలు అందిస్తుంది.

కొవిడ్ లాక్‌డౌన్ కంటే ముందు ప్రతి రోజుకు మెట్రోరైలులో ప్రయాణించే ప్యాసింజర్లు దాదాపు 4 లక్షలు.

హైదరాబాద్ మెట్రో రైలు రెండో విడత డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు స్టేజిలో ఉంది.

రెండో విడతలో 31 కి.మీ పొడవుతో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో రైలు రాయదుర్గం నుండి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ శంషాబాద్ వరకు వేయనున్నారు.



Next Story

Most Viewed