1857 తిరుగుబాటు విఫలమవడానికి కారణాలు (ఇండియన్ హిస్టరీ, జనరల్ స్టడీస్)

by Disha Web Desk 17 |
1857 తిరుగుబాటు విఫలమవడానికి కారణాలు (ఇండియన్ హిస్టరీ, జనరల్ స్టడీస్)
X

కేంద్రీకృతమైన నాయకత్వం లేకపోవడం

బ్రేక్‌ వాటర్స్‌ (1857 తిరుగుబాటు కాలంలో భారతీయులను ఆంగ్లేయులకు మద్దతు పలికిన అప్పటి గవర్నర్‌ జనరల్‌ కానింగ్‌ బ్రేక్‌ వాటర్స్‌ అని పేర్కొన్నాడు)

సమాచార వ్యవస్థ లోపం

తిరుగుబాటు కలసికట్టుగా జరగకపోవడం, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండటం.

అన్ని వర్ణాల వారు పాల్గొనకపోవడం. ప్రధానంగా మేధావి వర్గం దీనిలో పాల్గొనలేదు.

భారతీయ సిపాయిలు సంప్రదాయ ఆయుధాలను ఉపయోగించుట, ఆంగ్లేయులు ఆధునిక ఆయుధాలు ఉపయోగించుట.

క్రమశిక్షణ కలిగిన బ్రిటీష్‌ సైన్యం

తిరుగుబాటు నాయకుల్లో జాతీయ భావాలు లోపించుట

ఫలితాలు:

1858 చట్టం ప్రకారం బ్రిటీష్‌ ఈస్ట్‌ ఇండియా పాలన అంతం చేయబడింది.

భారతదేశం బ్రిటీష్‌ సామ్రాజ్యంలో ఒక భాగం అని ప్రకటించబడింది. ఈ విషయాన్ని అప్పటి గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కానింగ్‌ అలహాబాద్‌ దర్బార్‌ నుండి ప్రకటించాడు.

భారతదేశాన్ని పరిపాలించుటకు 15 మంది సభ్యులతో లండన్‌లో ఒక ఇండియా కౌన్సిల్‌ ఏర్పాటు చేయబడింది. దీనికి అధ్యక్షుడు బ్రిటీష్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్స్‌.

భారతదేశ సాంఘిక సాంప్రదాయాలలో జోక్యం చేసుకోకూడదని బ్రిటీష్‌ వారు నిర్ణయించారు.

భారతదేశంలో బ్రిటీష్‌ ‌సైన్యం పూర్తిగా వునర్‌ వ్యవస్థీకరించబడింది.

కలిసికట్టుగా పోరాటం చేయుటకు వర్గం నిర్ణయించింది.

ఇది తరువాత కాలంలో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఏర్పాటుకు తోడ్పడింది.

1857 తిరుగుబాటుకు ప్రధాన కారణము ముస్లింలు అని భావించి బ్రిటీష్‌వారు ముస్లిం వ్యతిరేక విధానాలను చేపట్టారు.

భారతదేశంలో బ్రిటీష్‌ సైన్యం పునర్‌వ్యవస్థీకరించబడింది.

స్టేట్‌మెంట్స్‌:

భారతదేశ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం - వి.డి.సావర్కర్‌ (వినాయక్‌ దామోదర్‌), కారల్‌ మార్క్స్‌

సిపాయిల తిరుగుబాటు - సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌, చార్లెస్‌ రేక్‌

ముస్లింల తిరుగుబాటు -కుప్లాండ్‌, రాబర్ట్స్‌

హిందూ ముస్లింల తిరుగుబాటు - కాయే, మాలీసన్‌, టేలర్‌

నల్లజాతి వారు తెల్లజాతి వారికి వ్యతిరేకంగా చేసిన యుద్ధం -కాయే

అనాగరిక ప్రజలు నాగరికులకు వ్యతిరేకంగా చేసిన యుద్ధం -హోమ్స్‌

సాంప్రదాయ శక్తులు క్రీస్టియానిటీకి వ్యతిరేకంగా చేసిన యుద్ధం - రీస్‌

జాతీయ తిరుగుబాటు -డిజ్రాయిలీ


Read More:

1857 సిపాయిల తిరుగుబాటు (లక్నో/అవధ్/ఝాన్సీ/అర్రా/ఫైజాబాద్‌)



Next Story