JNTUHలో విద్యార్థుల నిరసన.. ఎందుకో తెలుసా.?

by  |
JNTUHలో విద్యార్థుల నిరసన.. ఎందుకో తెలుసా.?
X

దిశ, కూకట్‌పల్లి : జేఎన్‌టీయూహెచ్ అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ వెంకటరమణారెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ జేఎన్‌టీయూహెచ్ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వర్సిటీ ప్రధాన గేటు వద్ద నిరసనకు దిగి వెంకటరమణారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం విద్యార్థి సంఘం నాయకుడు దిలీప్, అశోక్‌గౌడ్, నాగరాజు మాట్లాడుతూ పీహెచ్‌డీ అడ్మిషన్స్‌లో తారాస్థాయిలో అవినీతి జరిగిందని, అవినీతికి పాల్పడిన వెంకటరమణారెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు.

ఓపెన్ కేటగిరి విద్యార్థులను బీసీడీ విద్యార్థిగా చూపి బీసీడీ జనరల్ కోటాలో అడ్మిషన్ కేటాయిస్తూ వ్యవస్థను తప్పుదోవ పట్టించారన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థలకు ఎన్‌ఈటీ, ఎస్‌ఈటీ, గేట్‌పరీక్షలలో మెరిట్ ఉన్నప్పటికీ వారిని ఓపెన్​ కేటగిరిలో సీటు పొందకుండా కేవలం తమ కులాలకు సంబంధించిన సీట్లకే పరిమితం చేశారన్నారు. వెంకటరమణరెడ్డి అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో అఖిల్, రుత్విక్, రేవంత్, నవీన్, అభినవ్, వర్షిత్, రోహిత్, శివతేజ, మాజ్ పాల్గొన్నారు.


Next Story