నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : సీపీ అంజనీకుమార్

by  |
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : సీపీ అంజనీకుమార్
X

దిశ, మలక్ పేట్: లాక్‌డౌన్ నిబంధనలపై సీరియస్‌గా హైదరాబాద్ పోలీసులు వ్యవహరిస్తూ, నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత రూల్స్ బ్రేక్ చేసిన వారిపై కేసు నమోదు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ వద్ద బందోబస్తును సీపీ అంజనీ కుమార్ పర్యవేక్షించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నగరంలో ఈ లాక్ డౌన్ అమలు కోసం 180కి పైగా చెక్ పోస్టులను షిఫ్ట్ సిస్టంలో 24 గంటలు ఏర్పాటు చేశామని, ప్రతి జోన్ లో సీనియర్ అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా చెకింగ్ నిర్వహిస్తున్నారన్నారు.

చెక్ పోస్టుల వద్ద నిన్నటి నుండి స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నామని, లాక్‌డౌన్ ఉల్లంఘనకు పాల్పడితే వాహనాలు సీజ్ చేస్తున్నామని ఆయన వెల్లడించాడు. ప్రజలు అనవసరంగా బయటికి రాకూడదని, ఎమర్జెన్సీ అవసరాలకు మెడికల్, మెడిసిన్, హాస్పిటల్ వెళ్లే వారిని ఎసెన్షియల్ సర్వీస్ కింద అనుమతి ఇస్తున్నామని తెలిపారు. కొంత మంది పాత మందుల చీటిని వెంటపెట్టుకొని తిరుగుతున్నారని, కొంతమంది పాస్ లను వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. మరికొంత మంది అడ్రస్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఉన్నవారు మలక్ పేట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బి నగర్ ప్రాంతాలలో తిరుగుతున్నారు. ఇలా టైం పాస్ కోసం పాస్ లను తెచ్చుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ అంజన్ కుమార్ హెచ్చరించారు.



Next Story

Most Viewed