జోషి తాత.. ఫేమస్ అయిపోతాడా?

by  |
జోషి తాత.. ఫేమస్ అయిపోతాడా?
X

దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా పాండమిక్ కారణంగా ఎంతోమందికి ఉపాధి కరువైంది. యువకులు కూడా ఉద్యోగావకాశాలు లేక చింతిస్తున్నారు. కానీ.. ఓ 87 ఏళ్ల తాత మాత్రం ఉపాధిని సృష్టించుకుని, తన కాళ్ల మీద తాను నిలబడేందుకు ప్రయత్నిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇటీవలే ఆ తాతను చూసిన ఓ నెటిజన్.. తాతకు మరింత గిరాకీ పెరగాలని ఓ చిన్ని ప్రయత్నంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ కొన్ని గంటల్లోనే వైరల్ కావడం విశేషం.

సోష‌ల్ మీడియా ప‌వ‌ర్ అంతా ఇంతా కాదు. ఒక చిన్న మెసేజ్ ఎందరినో కదిలించగలదు. ఎందరికో సాయం అందిచగలదు. ఇటీవలే ‘బాబా కా దాబా, పార్వతీయమ్మ’ వంటి అనేక మంది వ్యాపారాలు సోషల్ మీడియా ద్వారా సక్సెస్ కావడం చూశాం. ఇది కూడా అలాంటిదే. ముంబైలోని ఫడేకే రోడ్ డోంబివాలిలో రీసైకిల్ బ్యాగుల‌ను అమ్ముతూ ఉపాధి పొందుతున్న 87 ఏళ్ల జోషి అనే వ్య‌క్తి క‌థ‌ను ఓ యూజర్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. ‘చిరిగిన సోఫా క‌వ‌ర్లు, క‌ర్టెన్లను ఆ తాత అంద‌మైన బ్యాగులుగా తీర్చుదిద్దుతున్నాడు. కేవ‌లం రూ. 40-80కే ఈ అంద‌మైన బ్యాగును సొంతం చేసుకోవ‌చ్చు. అతి త‌క్కువ ధ‌ర‌కే చేతిసంచుల‌ను అమ్ముతున్న ఈ పెద్దాయనను మ‌న‌మూ ఫేమ‌స్ చేద్దాం.. బ్యాగ్ కొన‌డం మాత్రం మ‌ర‌వ‌ద్దు’ అంటూ వీడియాను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ నచ్చిన నెటిజన్లు వెంటనే లైకులు, కామెంట్లతో పాటు విపరీతంగా షేర్ చేస్తున్నారు. ‘ఈ వ‌య‌సులోనూ ఎంతో క‌ష్ట‌ప‌డుతున్న జోషి తాతకు మ‌న‌మూ అండగా ఉందాం.. తాత దగ్గర తప్పకుండా బ్యాగును కొంటాను’ అంటూ ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

https://twitter.com/ardor_gauri/status/1317521136289255424?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1317521136289255424|twgr^share_3,containerclick_0&ref_url=https://www.sakshi.com/telugu-news/social-media/87-year-old-mumbai-man-selling-recycled-bags-goes-viral-1322517

Next Story

Most Viewed